బీఆర్ఎస్ కోసమే తెలంగాణలో కాంగ్రెస్ పనిచేస్తోంది

- బీజేపీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ కోసమే తెలంగాణలో కాంగ్రెస్ పనిచేస్తోందని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒప్పందంపై ప్రజలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.కేసీఆర్ సహా దేశంలో రెండు డజన్ల మంది ప్రధాని‌ పదవిని కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ కోసమే రేవంత్ రెడ్డి తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఖర్గే, బీఆర్ఎస్ దోస్తీపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని, ఖర్గే, నితీష్, మమతాబెనర్జీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు.తెలంగాణలో కేసీఆర్ అత్యాచార ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని తరుణ్ చుగ్ అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేవరకు పోరాటం చేస్తామని, నిరుద్యోగులకు లక్ష రూపాయల ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో నిరుద్యోగుల పక్షాన ఆందోళలు కొనసాగిస్తామని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.