మహానగరంలో పట్టు కోసం ఆపరేషన్‌ ఆకర్ష్‌ కు తెరతీసిన కాంగ్రెస్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్:  గ్రేటర్‌లో ఒక్కటంటే ఒక్క సీటు గెలవకపోవడంతో ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఆపరేషన్‌ ఆకర్ష్‌కు పదును పెడుతోంది. ఎన్నికలకు ముందు పలువురు కార్పొరేటర్లు కాంగ్రె్‌సలో చేరగామరికొందరు హస్తం వైపు చూస్తున్నారని తెలిసింది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ అగ్రనేతలతో టచ్‌లో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ మహానగరంలో ఖాతా తెరువలేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఒక్క చోటా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్‌లో శాసనసభ్యుల ప్రాతినిధ్యం లేకపోవడం ఆ పార్టీకి లోటుగా మారింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పార్టీ బలోపేతంవచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతలు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాల్లో అపూర్వ ఆదరణ లభించిన పార్టీకి.. నగరంలో ఎందుకు ఎదురుగాలి వీచింది..లోపాలేమిటి బీఆర్‌ఎస్‌ అనుకూలాంశాలేంటి..అన్న దానిపై పార్టీలోని కీలక నేతలు పోస్టుమార్టం చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో పార్టీ పటిష్టత కోసం చేరికలను ప్రోత్సహించే యోచనలో కాంగ్రెస్‌ రాష్ట్ర అగ్రనేతలు వ్యూహాత్మకంగా వారు పావులు కదుపుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు లక్ష్యంగా ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలో ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేని నేపథ్యంలో కార్పొరేటర్ల చేరికల ద్వారా స్థానికంగా ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించవచ్చన్నది నేతల ఆలోచనగా చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుకార్పొరేటర్ల మధ్య సఖ్యత లేదు. అలాంటి వారిపై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సమాచారం. టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డితో పరిచయమున్న పలువురు ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లుగా ఉన్నారు. వారు పార్టీలో కొనసాగుతారా హస్తం గూటికి వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లలో కొందరు టీడీపీ నుంచి వచ్చిన వారున్నారు. వారితోనూ సంప్రదింపులు జరుగుతున్నట్లు వినికిడి.

తానుతీసిన గోతిలో తానే పడుతున్న బిఅర్ఎస్!

తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ (అప్పటి టీఆర్‌ఎస్‌) మహానగరంలో పట్టు కోసం భారీస్థాయిలో ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీసింది. ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుంది. ఏడాదిన్నర వ్యవధిలో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రికార్డుస్థాయి విజయం సాధించింది. అంతకుముందు అభ్యర్థులు లేక జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయని పార్టీ.. అధికారంలోకి వచ్చిన అనంతరం అనూహ్య విజయం సాధించింది. 150 స్థానాలకుగాను ఏకంగా 99 డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. పూర్వ ఎంసీహెచ్‌, ప్రస్తుత జీహెచ్‌ఎంసీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మేయర్‌ పీఠం దక్కించుకుంది. 2016లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగగా.. అంతకుముందే నగరంలోని టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. మాజీమంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ సహా ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న చాలామంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. ఇదే వ్యూహం కాంగ్రెస్‌ అమలు చేస్తే..? ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. వారి వెంట కార్పొరేటర్లు వెళ్లకుండా నిలువరించే ప్రయత్నంలో భాగంగానే తెలంగాణ భవన్‌లో సమావేశం ఏర్పాటు చేశారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ‘ఇది మనకు క్లిష్ట సమయం. ఇప్పుడు పార్టీతో ఉన్నోళ్లే మనోళ్లు. ఇతర పార్టీలు, వ్యక్తులు మభ్యపెడితే ఆశపడొద్దు. మోసపోవద్దు. భవిష్యత్తు బీఆర్‌ఎ్‌సదే. మీ అందరికీ కార్పొరేటర్లుగా మరోసారి పోటీ చేసే అవకాశం కల్పిస్తాం. ఇందుకు నాది హామీ’ మూడురోజుల క్రితం జీహెచ్‌ఎంసీ పార్టీ కార్పొరేటర్ల సమావేశంలో కేటీఆర్‌ అన్న వ్యాఖ్యలివి. ఇవే కాదు..అధికార పార్టీ ఏం చేయబోతుంది..? దానిని సమష్టిగా ఎలా తిప్పికొట్టాలి..? అన్న దిశానిర్దేశం చేస్తూ.. పార్టీ కమిటీల ఏర్పాటూ ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ సమావేశమని చెబుతున్నారు. కార్పొరేటర్ల సమావేశంలో గతానికి భిన్నంగా కేటీఆర్‌ ఎందుకు మాట్లాడారు..? ఎమ్మెల్యేలు లేకుండా కేవలం కార్పొరేటర్లతో సమావేశమవడానికి కారణమేంటి..? గ్రేటర్‌లో పార్టీ గెలుపునకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పేందుకే మీటింగ్‌ ఏర్పాటు చేశారా..? మరేదైనా కారణముందా..? అంటే రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.జిల్లాల్లో అత్యధిక సీట్లు సాధించుకొని కాంగ్రెస్‌ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే గ్రేటర్‌లో ఒక్కటంటే ఒక్క సీటు గెలవకపోవడంతో ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’కు పదును పెడుతోంది. ఎన్నికలకు ముందు పలువురు కార్పొరేటర్లు కాంగ్రె్‌సలో చేరగా, మరికొందరు హస్తం వైపు చూస్తున్నారని తెలిసింది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ అగ్రనేతలతో టచ్‌లో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ మహానగరంలో ఖాతా తెరువలేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఒక్క చోటా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్‌లో శాసనసభ్యుల ప్రాతినిధ్యం లేకపోవడం ఆ పార్టీకి లోటుగా మారింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పార్టీ బలోపేతం, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతలు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాల్లో అపూర్వ ఆదరణ లభించిన పార్టీకి.. నగరంలో ఎందుకు ఎదురుగాలి వీచింది..? లోపాలేమిటి ? బీఆర్‌ఎస్‌ అనుకూలాంశాలేంటి..? అన్న దానిపై పార్టీలోని కీలక నేతలు పోస్టుమార్టం చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో పార్టీ పటిష్టత కోసం చేరికలను ప్రోత్సహించే యోచనలో కాంగ్రెస్‌ రాష్ట్ర అగ్రనేతలు వ్యూహాత్మకంగా వారు పావులు కదుపుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు లక్ష్యంగా ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలో ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేని నేపథ్యంలో కార్పొరేటర్ల చేరికల ద్వారా స్థానికంగా ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించవచ్చన్నది నేతల ఆలోచనగా చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల మధ్య సఖ్యత లేదు. అలాంటి వారిపై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సమాచారం. టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డితో పరిచయమున్న పలువురు ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లుగా ఉన్నారు. వారు పార్టీలో కొనసాగుతారా ? హస్తం గూటికి వెళ్తారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లలో కొందరు టీడీపీ నుంచి వచ్చిన వారున్నారు. వారితోనూ సంప్రదింపులు జరుగుతున్నట్లు వినికిడి.

Leave A Reply

Your email address will not be published.