ఏ ఊర్లో ఇందిరమ్మ ఇళ్లు లేదో కాంగ్రెస్ ఆ ఊర్లో ఓటు అడగదు .. ఏ ఊర్లో డబుల్ బెడ్రూం ఇవ్వలేదో ఆ ఊర్లో మీరు ఓట్లు అడగొద్దు ఇందుకు రామారావ్ సిద్ధమా?

- సవాల్ విసిరినా రేవంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో బీజేపీ, బీఆరెస్ లు కులాల మధ్య, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నాయని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. రాహుల్ సందేశాన్ని ప్రతీ గుండెకు, ప్రతీ ఇంటికి చేర్చేందుకు హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి ఏఐసీసీ పిలుపునిచింది. ఇంటింటికి కరపత్రాలు అందించి, హాత్ సే హాత్ జోడో స్టిక్కర్ అంటించి రాహుల్ సందేశాన్ని చేరవేయాలని సూచించారు. 2009 కంటే ముందు కొడంగల్ పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి మీరు కష్టపడి నాటిన మొక్క.. ఒక వృక్షమై కోదంగాలనుకు ఒక గుర్తింపు తీసుకొచ్చింది వాస్తవం కాదా ఆలోచించండి అన్నారు. రావులపల్లి, మద్దూరు, కోయిల్ కొండ కు డబుల్ రోడ్డు తీసుకొచ్చాం. కానీ కృష్ణా జలాలు తెస్తా అని చెప్పిన వాళ్లు.. కనీసం దౌల్తాబాద్ చెరువు తూము మూతపడితే తట్టెడు మట్టి తీయలేదు.

ఏ ఊర్లో ఇందిరమ్మ ఇళ్లు లేదో కాంగ్రెస్ ఆ ఊర్లో ఓటు అడగదు. ఏ ఊర్లో డబుల్ బెడ్రూం ఇవ్వలేదో ఆ ఊర్లో మీరు ఓట్లు అడగొద్దు. ఇందుకు డ్రామారావు సిద్ధమా అని నేను సవాల్ విసిరారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప .. ఈ అయిదేళ్లలో కొడంగల్ కు మీరు చేసిందేంటి? 119 నియోజకవర్గాల బీ ఫామ్ పై సంతకం పెట్టే అవకాశం సోనియా మనకు ఇచ్చారు. మన ఓటు మనం వేసుకుంటే.. ఎవరిదగ్గరా చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం ఉండదు. మన ఊర్లలో రైలు కూత వినిపించే బాధ్యత నేను తీసుకుంటా. నాపై కోపంతో నారాయణపేట్ ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ పక్కన పెట్టారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే తప్ప కొడంగల్ కు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కొడంగల్ ప్రజలకు నా చేతనైన సాయం చేశాను.. ఏ ఒక్కరి దగ్గర చేయి చాచలేదు. నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అన్నారు. కానీ ఇప్పుడు కొడంగల్ లో పరిస్థితి మారింది. ఏ పంచాయితీ అయినా బీఆరెస్ నేతలు లంచాలు వసూలు చేస్తున్నారు. ఎన్నికలప్పుడు కేసీఆర్ కాళ్లు మొక్కి అయినా సరే దౌల్తాబాద్ కు జూనియర్ కాలేజి తీసుకొస్తా అని హరీష్ రావు అన్నడు. మరి ఇప్పుడు కాలేజి ఎందుకు తెలేదు కేసీఆర్ కు కాళ్లు లేవా? స్థానిక నాయకులు ప్రతీ ఇంటికి తిరగండి. నేను పాదయాత్రలో ఉన్నా ఇక్కడి సమాచారం నాకు తెలుస్తుంది. మన చేతిలో ఉన్న అవకాశాన్ని వదులుకోవద్దని ఆయన ప్రజలను కోరారు.

Leave A Reply

Your email address will not be published.