14 ఏళ్ల తర్వాత ఓటమిపాలైన కన్జర్వేటివ్ పార్టీ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఈ ఎన్నికల్లో తన పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తున్నానని కన్జర్వేటివ్ పార్టీ నేత, ప్రస్తుత ప్రధాని రిషి సునక్ చెప్పారు. ఈసారి కూడా రిచ్‌మండ్ అండ్ నార్తాలర్టన్ స్థానం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు.

బ్రిటన్ పార్లమెంట్‌లో మొత్తం స్థానాల సంఖ్య 650.2019 పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ 365 సీట్లు గెలుచుకుంది. అప్పుడు బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రి అయ్యారు. కానీ, ఈసారి పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది.

2019 ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష లేబర్ పార్టీకి 203 సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో లేబర్ పార్టీ తమకు పట్టున్న స్థానాల్లో కూడా ఓడిపోయింది. ఇప్పుడు సంపూర్ణ మెజార్టీతో గెలిచింది.

14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత ఏ ప్రభుత్వమైనా మళ్లీ ఎన్నికల్లో గెలవడం అసాధారణమని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత కన్జర్వేటివ్ ఎంపీ డెహ్నా డేవిడ్‌సన్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.