డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ ను కొనసాగించి 12 నెలలకు కన్సలిడేట్ జీతం ఇవ్వాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ (1940) ను కొనసాగించి – 12 నెలలకు కన్సలిడేట్ జీతం ఇవ్వాలని రాజ్య సభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేసారు. సోమవారం నిరుద్యోగుల జే‌ఏసిన ఛైర్మన్ నీల వెంకటేష్ అధ్యక్షత జరిగిన మీడియా సమావేశంలో ఆర్. కృష్ణయ్యమాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లోని 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దాదాపు 3.00.000 లక్షల మంది నిరుపేద బడుగుబలహిణవర్గాల పిల్లలు విద్యానాభ్యశిస్తున్నారు. వారిని సరైన మార్గంలో  నిర్ధాశింపచేసేది  అ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులే తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు కంటే ముందు  నుంచే  తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  పనిచేసున్న  అతిథి అధ్యాపకులకు  మొదట  ఒక  గంటకు  50రూ. చొప్పున  1hour X50X 72=3600 జీతం చెల్లించేవారు. అవిధంగా ఒకనెలలో   72 గంటలకు మించి  విద్యార్థులకు పాఠాలు బోధించిన  వీరికి  అదే  3600రూ..లను చెల్లిస్తారు. అ తర్వాత ఐదు, ఆరు సంవత్సరాల  తర్వాత ఒక గంటకు 1hour x100 చొప్పున ఒకనెలలో  72 గంటలకు గాను 100*72=7200రూ.. ల చాలిచాలని  జీతాలకు పనిచేస్తు రాష్ట్ర విద్యభివృద్ధిలో ప్రాముఖ పాత్ర పోషించారు. అ తర్వాత 4సం.. రాలకు  డిప్యూటీ సిఎం శ్రీ కడియం  శ్రీహరి గారు విద్యాశాఖ మంత్రి  హయాంలో ఒక  గంటకు  300రూ.. ల చొప్పున 72 గంటలకు మించి  బోధించిన విరికి చెల్లించేది  మాత్రం 72గంటలకే అంటే 72×300=21600 రూ.. ఇచ్చేవారు అని అన్నారు. అనంతరం నీల వెంకటేష్ మాట్లాడుతూ  ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో  కరికులంతో పాటు వీళ్ళు కూడా బయో మెట్రిక్  హాజరుతో పాటు 6..గంటల వరకు కళాశాల ఆవరణంలో  ఈ అతిథిఅధ్యాపకులు పని చేస్తూ వుంటారు. కానీ వీరికి ప్రభుత్వం, ఉన్నత విద్యా కమిషనర్ వారు ఏలాంటి సర్వీస్ సర్టిఫికెట్ కానీ కాన్సలిడేట్ జీతాలు ఇవ్వరు అదేకాకుండా ప్రతి సంవత్సరం  వీళ్ళు డెమో, ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందే.2023-2024 అకాడమిక్ సం.. రానికి గాను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ T. హరీష్ రావు గారు గత  సంవత్సరము పనిచేసిన 1940 మంది అతిథి అధ్యాపకుల (GUEST FACULTIES)ను రెన్యూవాల్ కోసం అనుమతులు ఇచ్చినారు అన్నారు తెలంగాణ ఉన్నత విద్యాశాఖ కమిషన్ వారు date 05/7/2023 రోజున ఆర్థిక శాఖ ఇచ్చిన G.O. no.1118 ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోవడంలేదు.కాబట్టి ప్రభుత్వం, విద్యా శాఖ మంత్రిగారు చొరవ తీసుకొని  గత 2022-2023 విద్యా సంవత్సరములో కాలేజీల్లో పని చేసిన 1940 మంది అతిథి అధ్యాపకులను  మళ్ళీ ఈ అకాడమీక్ ఇయర్ 2023-2024 సం.. రానికి కూడా కొనసాగించి (రెన్యువల్ )మరియు  వారికీ కాన్సలిడేట్ జీతాలు చెల్లించి  రాష్ట్రము లోని 1940 మంది అతిథి అధ్యాపకుల కుటుంబలకు మరియు రాష్ట్రము లోని దాదాపు 3,00,000 లక్షలvమంది బడుగుబలహీనవర్గల విద్యార్థులకు విద్యావ్యవస్థ అభివృద్ధికి చేయూతనివ్వగలరని ఉన్నత విద్యా శాఖ కమిషనర్ గారిని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము అన్నారు.ఈ సమావేశంలో తెలంగాణ డిగ్రీ లెచర్స్ పోరం వ్యస్థాపక అధ్యక్షులు జి. శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ జె. నాగేశ్వర రావు, అసోసియేషన్ ప్రెసిడెంట్ డా. జయరాములు , బి. వెంకట్ స్వామి, గెస్ట్ లెచర్స్ భార్వవి గౌడ్, మమతా, శ్యామల, కరుణాకర్, లక్ష్మి నారాయణ, కేశవులు, కృష్ణ, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.