ఒడిశా రైలు ప్రమాదం వెనుక కుట్రకోణం?

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: ఒడిషాలో శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంపై కీలక విషయాలు వెలుగు చూస్తుండగా.. మరింత కీలక సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ ఘోర ప్రమాదం విషయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. వీటికి అనుగుణంగా కీబోర్డులకు పనిచెబుతున్న నెటిజన్లు… నైతిక బాద్యత వహిస్తూ రైల్వే మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ ను తెరపైకి తెస్తున్నారు. ఈ సమయంలో ఈ ప్రమాదం వెనక కుట్ర కోణం దాగిఉందనే అంశం తాజాగా తెరపైకి వచ్చింది.తాజాగా జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదంపై వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఒడిషా రైలు ప్రమాద ఘటన వెనుక కుట్రకోణం ఉండొచ్చని.. ఈ విషయంపై కేంద్రం సమగ్ర విచారణ జరిపించాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.అయితే ఈ అనుమానపు వ్యాఖ్యలు ఆమె ఊరకే అనలేదని.. ఏదో సంచలనాల కోసం ఈ కామెంట్స్ చేయలేదని చెబుతూ… సరిగ్గా 14ఏళ్ల క్రితం అదే శుక్రవారం రోజు జరిగిన సంఘటనను తెరపైకి తెస్తున్నారు విశ్లేషకులు. అవును… తాజాగా జరిగిన ఘోర రైలు ప్రమాధంతో 2009 నాటి రైలు ప్రమాదాన్ని గుర్తుకుతెస్తోన్నారు పరిశీలకులు. దానికి కారణం… అప్పుడు కూడా సరిగ్గా శుక్రవారం రాత్రి ఏడుగంటల సమయంలో ఇదే కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది.14 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 13 2009న ఒడిశాలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఆ రోజు కూడా శుక్రవారమే కావడం గమనార్హం. ఆరోజు కూడా రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలోనే ప్రమాదం జరిగింది. అప్పుడు కోరమండల్ ఎక్స్ ప్రెస్ అత్యంత వేగంతో జైపుర్ రోడ్ రైల్వే స్టేషన్ దాటుతోంది. ట్రాక్ మార్చుకుంటున్న సమయంలో అదుపు తప్పడంతో రైలు పట్టాలు తప్పి బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ సమయంలో ఇంజిన్ మరో ట్రాక్ మీద పడిపోయింది. ఆ ఘటనలో 16 మంది దుర్మరణం పాలవ్వగా.. పలువురు గాయపడ్డారు.ఇదే క్రమంలో తాజాగా జరిగిన రైల్ ప్రమాధంపై కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్రమాదానికి కారణం సాంకేతిక పరమైన సమస్యనా? లేదా నిర్వహణ లోపమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం… రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ తాజా స్పందన అని తెలుస్తుంది. ఆయన కథనం ప్రకారం… తొలుత కోరమాండల్ ఎక్స్ ప్రెస్.. నిలిపి ఉంచిన గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పిందని వాటి బోగీలను బెంగళూరు – హావ్డా సూపర్ ఫాస్ట్ రైలు ఢీకొన్నట్లు తెలుల్స్తుంది.దీంతో ప్రమాదంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అమితాబ్ శర్మ చెప్పిందే నిజమైతే.. గూడ్స్ రైలు ఉన్న ట్రాక్ పైకి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ను ఎలా అనుమతించారనేది కీలక ప్రశ్నగా ఉంది. దీంతో మానవతప్పిందం అనే కామెంట్ తెరపైకి వస్తుంది. ఫలితంగా… కుట్రకోణం అనే అంశం కూడా తదనుకునంగా చర్చలోకి రావడం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.