రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్ల ఉప్పల్ ఫ్లైఓవర్  నిర్మాణ జాప్యం

- యుద్ధ ప్రాతిపదిక రోడ్డు నిర్మాణ పనులకు 24 జులైన  కోటి 69 లక్షల మంజూరు -  కేంద్రం రోడ్డు వేయడం లేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సిఎం కెసిఆర్ - ఉప్పల్ మాజీ శాసనసభ్యుడు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ వెల్లడి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉప్పల్ ఫ్లైఓవర్  నిర్మాణ పనులలో జిహెచ్ఎంసి రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్ల జరుగుతున్నటువంటి జాప్యం పైన  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరియు ఉప్పల్ మాజీ శాసనసభ్యుడు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి అయినా నితిన్ గడికరి గారి దృష్టికి తీసుకువెళ్లి యుద్ధ ప్రాతిపదిక మీద రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కోరిన పిమ్మట ఒక కోటి 69 లక్షల 17 వేల రూపాయలను 24 జులై నాడు అనుమతి మంజూరు చేసి ఈనెల 28న పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి సంబంధిత అధికారులని ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఆర్ అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు మరియు ముఖ్యమంత్రి మేమే రోడ్డు వేస్తాం కేంద్రం  వేయడం లేదు అన్నట్టుగా మళ్లీ కపట నాటకానికి తెరదించారు ఆ రకంగా ప్రకటన విడుదల చేశారు.  ఈ రహదారి నిర్మాణానికి సంబంధించిన నిధులు విడుదల చేసిన జీవో కాపీని మీడియాకు విడుదల చేసారు.

Leave A Reply

Your email address will not be published.