పేదల అభ్యున్నతికి పాటుపడతా .. సభాపతి పోచారం

పేదల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం బైరాపూర్ గ్రామంలో  శుక్రవారం శాసనసభ స్పీకర్ గ్రామస్తులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ జెడ్పిటిసి సభ్యుడు ద్రో ణవల్లి సతీష్ ఆధ్వర్యంలో స్పీకర్ పోచారం కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలతో కలిసి దండియా ఆడి వారిలో ఉత్సాహం నింపారు. బీర్కూరు మండల కేంద్రం నుంచి బైరాపూర్ వరకు భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. అనంతరం విట్టల్ రుక్మిణి కల్యాణమండపంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తాను సంపాదించే డబ్బును తన కుటుంబ సభ్యుల అవసరాలకు మాత్రమే ఖర్చు చేసుకోవాలని సూచించారు. అనవసరమైన వ్యసనాలకు డబ్బును ఖర్చుపెట్టి అనేకమంది తమ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మనిషి తన సంపాదనను తన భార్య చేతికి అందిస్తే ఆ కుటుంబం సుఖ సంతోషంగా ఉంటుందని వివరించారు. రాజకీయం అనేది గొడవ పడడానికి కాదని ప్రజాసేవ చేసేందుకు అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి  వెల్లడించారు. రాజకీయాలలో ఉంటూ ఒకరికి సహాయం చేయాలి తప్ప ఎవరికి నష్టం కలిగించే విధంగా ప్రవర్తించవద్దని అన్నారు. రాష్ట్రంలోనే తొలి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు భైరాపూర్ లోనే పంపిణి చేయడం జరిగిందన్నారు. భైరాపూర్ గ్రామంలో ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాలు అందించేందుకు మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ కృషి చేస్తున్నారని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.