పట్నం, పైలట్ మధ్య మాటల తూటాలు .. బాహబాహీ    

రసాభాసగా మారిన చేవెళ్ల లోక్‌సభ సన్నాహక సమావేశం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికల పై దృష్టి సారించింది. ఆయా జిల్లాలకు సంబంధించిన ఎంపీ స్థానాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ భవన్‌లో చేవెళ్ల లోక్‌సభ కు సంబంధించిన సన్నాహక సమావేశం శుక్రవారం నాడు నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు సమావేశానికి హాజరయ్యారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 100 మందిని ఆహ్వానించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరులో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెంది కాంగ్రెస్ గెలచింది. అప్పటి నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, ఫైలట్‌ రోహిత్‌రెడ్డికి సంబంధించిన రెండు వర్గాలు ఒకరిపై ఒకరు అజమాయిషి చెలాయిస్తున్నారు.రాబోయే లోక్‌సభ ఎన్నికలకు పార్టీ కేడర్‌ను సమాయత్తం చేసి, వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చిస్తున్న సమయంలో తాండూర్ బీఆర్ఎస్ వర్గపోరు మరో మరోసారి భయటపడింది. కేటీఆర్, హరీష్‌రావు మరికొంతమంది సీనియర్ నాయకుల అధ్యక్షతన జరుగుతున్న సమీక్షా సమావేశంలో తాండూర్ నియోజకవర్గ నాయకుల మధ్య వివాదం చెలరేగింది. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సమావేశంలో మాట్లాడుతుండగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. తాండూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌ని పట్నం మహేందర్‌రెడ్డి భ్రష్టు పట్టించారని…మొన్నటి ఎన్నికల్లో పట్నం మహేందర్‌రెడ్డి అనుచరులు పార్టీకి అనుకూలంగా పనిచేయకపోవడంతోనే పైలెట్ రోహిత్‌రెడ్డి ఓడిపోయారని విమర్శించారు. దీంతో అక్కడే ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి వర్గీయులు ఫైలట్ రోహిత్‌రెడ్డి అనుచరులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. అదే సమయంలో పట్నం, పైలట్ మధ్య మాట మాట పెరిగి బాహబాహీకి దిగారు.

Leave A Reply

Your email address will not be published.