కొత్త రూపాల్లో కరోనా మానవాళి పై విరుచుకుపడుతున్న కరోనా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎప్పటికప్పుడు కొత్త రూపాల్లో కరోనా మానవాళి పై విరుచుకుపడుతూనే ఉంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. గత ఆరు నెలల కాలంతో పోలి స్తే తాజాగా కేసులు పెరగడం అందరిలోనూ ఆందోళనకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ప్రధాని మోడీ కీలక సమావేశం నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు.కాగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5880 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం గంటల నుంచి సోమవారం ఉదయం గంటల వరకు 85076 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 5880 కేసులు వెలుగు చూశాయి.  దీంతో దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 35199 కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో మొత్తం 14 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 530979కి చేరింది. రికవరీ రేటు 98.73 శాతంగా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.ఈ నేపథ్యంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశారు.మరోవైపు కరోనాను ఎదుర్కొనేందుకు వీలుగా సంసిద్దులను చేసేందుకు రెండు రోజులపాటు ఏప్రిల్ 10 11 తేదీల్లో దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో నాలుగో వేవ్ తప్పదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా చివరి  మ్యూటేషన్ ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.ఇప్పుడు వస్తున్న మరో వేరియంట్ ఎక్స్బీబీ 1.16 వంటి వాటితోనే కేసులు పెరుగుతున్నాయని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో మాస్కుల వినియోగం చేతులు శుభ్రం చేసుకోవడం సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో కేసుల తీవ్రత కారణంగా తిరిగి మాస్కుల వినియోగం తప్పనిసరి చేశారు.
విదేశాల నుంచి వచ్చే వారికి పరీక్షలు చేస్తున్నారు. హర్యానాలో పాఠశాలల్లో మాస్కును తప్పనిసరి చేశారు. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో అంత ఇబ్బందికర పరిస్థితులు లేవని చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.