కరోనా కదలికలు కవితా సంపుటి విడుదల

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఉపాధ్యాయుడు బీసీ ఉద్యమ కారుడు తెలంగాణ కవుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుతారాపు వెంకట నారాయణ రచించిన కరోనా కదలికలు – పుస్తక ఆవిష్కరణ విద్యానగర్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయం లో జరిగింది. ఎమ్మెల్సీ.బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్క రించారు.సోషల్ మీడియాను ఉపయోగించుకొని కవులు తమ ఆలోచనలతో సమాజ మార్పుకు చైతన్యానికి దోహద పడాలని ఆర్.కృష్ణయ్య కోరారు. సమకాలీన సమాజాన్ని గమనిస్తూ సమాజం లోని కుళ్ళును కడిగేసి రచనలు సుతారం కలం నుండి జాలువారుతున్నాయని ఆయన అభినందించారు.ఈ సంధర్భంగా జరిగిన కవిసమ్మేళ్ల నం లో 10మంది కవులు కవితా గానం చేశారు. ఎన్వీ రఘువీర్ ప్రతాప్ అనుముల ప్రభాకరా చారి దొంతరబోయిన దైవాదీనం గజవెల్లి దశరథ రామయ్య డాక్టర్.పున్నా విజయ లక్ష్మి రుద్రంగీ రమేశ్ వాలి హుస్సేన్ ఎండీ అబ్దుల్ రషీద్ టీకే చారి కవితా గానం చేశారు. కవి వెంకట నారాయణ తన కవితా ప్రస్థానాన్ని వివరించారు.కవితా గానం చేశారు.కవులను ఆర్. కృష్ణయ్య సత్కరించారు.

Leave A Reply

Your email address will not be published.