మరోసారి విజృంభిస్తున్న కరోనా వైరస్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కరోనా మరోసారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు ఎనిమిది నెలల కాలంలో ఇదే అధికంగా నమోదైన కేసుల సంఖ్య. బుధవారం ఒక్కరోజే 8 వేలకు చేరువలో కొత్త కేసులు నమోదు కాగా, ఈ రోజు ఆ సంఖ్య 10 వేలు దాటింది.యాక్టివ్ కేసుల సంఖ్య 44,998కి చేరింది. గడిచిన 24 గంటల్లో 7,830 కేసులు నమోదయ్యాయి. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,42,10,127కి చేరుకుంది. 19 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,035కి ఎగబాకింది. కేసుల సంఖ్య పెరగటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ టెన్షన్ మరోసారి మొదలైంది. రోజూవారి పాజిటివిటీ రేటు ఏకంగా 4.42 శాతానికి పెరిగింది. ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.10 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 98.71 శాతం, మరణాల రేటు 1.19శాతంగా ఉందని పేర్కొంది. ఇదే సమయంలో రానున్న 10-12 రోజుల్లో కేసులు మరింతగా పెరిగి, ఆ తరువాత తగ్గుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ అంచనా వేస్తోది. ఒమిక్రాన్ XBB.1.16 సబ్‌వేరియంట్ ప్రస్తుత ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కారణంగా భావిస్తున్నారు. దీంతో, 12 రోజుల తరువాత కేసుల సంఖ్య తగ్గుందని అధికారులు చెబుతున్నారు.

అటు కోవిడ్ వాక్సిన్ ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో ఆదార్ పునావాల్ ప్రకటించారు. కోవీషీల్డ్ టీకాలను అవసరం మేర అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. మహారాష్ట్రలో కేసల సంఖ్య ఎక్కువగా ఉంది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. ఉత్తరప్రదేశ్ లో విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పరీక్షలు తప్పని సరి చేసారు. కోవిడ్ ఎదుర్కొనేందుకు సంసిద్దతలో భాగంగా కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోనూ మాక్ డ్రిల్ నిర్వహించింది. కేసులు పెరిగినా ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరగలేదు.

Leave A Reply

Your email address will not be published.