తెలంగాణలోమొదలైన కరెంట్ కస్టాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణలో కరెంట్ కోతలు విపరీతమయ్యాయి. విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో.. తెలియని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సమస్య పరిస్కరించాలని ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని రైతులు ప్రతిరోజూ ధర్నా చేస్తున్నారు. ఓ వైపు అధినేత కేసీఆర్ తెలంగాణలో అమలవుతున్న 24 గంటల విద్యుత్ ను దేశ వ్యాప్తంగా చేస్తామని హామీలు ఇస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం కనీసం గంటలు కూడా ప్రసారం కావడం లేదని రైతులు వాపోతున్నారు.ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కొందరు రైతులు నిలదీస్తున్నారు. విద్యుత్ సరఫరాపై ఫోన్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలు ఇది వచ్చే ఎన్నికలకు ఎఫెక్ట్ పడుతుందాఅని చర్చించుకుంటున్నారు.తెలంగాణలో మొన్నటి వరకు విద్యుత్ సమస్య లేదు. 24 గంటలు సాఫీగానే సాగింది. కానీ సరిగ్గా ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ అంతరాయం ఏర్పడడం ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. అసలై బీఆర్ఎస్ ఇచ్చిన కొన్ని హామీలు నెరవేరలేదని కొందరు ఆయా నియోజకవర్గాల్లో మంత్రులను సైతం నిలదీస్తున్నారు. కొందరిని తరిమికొడుతున్నారు కూడా. ఇలాంటి తరుణంలో ఇప్పుడు కరెంట్ కోతలు ఉండడంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.మరి కొద్ది నెలల్లోనే ఎన్నికలు ఉండడంతో ఎమ్మెల్యేలు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుక  విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సమయంలో రైతులు కరెంట్ కోతలపై నిలదీస్తున్నారు. ఇక నియోజకవర్గాల్లోకి రాని వారికి ఫోన్లు చేసి కరెంట్ సమస్యపై అడుగుతున్నారు. గ్రామాల్లో నిత్యం కరెంట్ కోతలు ఉంటున్నాయని సమయ పాల లేకుండా కరెంట్ ను కట్ చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో హామీ ఇచ్చేంత వరకు పట్టుబడుతున్నారు.ఇదిలా ఉండగా ఫిబ్రవరిలోనే కరెంట్ కోతలు ఇలా ఉంటే వచ్చే  మే వరకు పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లో విద్యుత్ ఉత్పత్తికి వినియోగానికి భారీ తేడా ఉంది. దీంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.ప్రస్తుతం కరెంట్ కొనుగోలు చేయాలంటే ముందుగా డబ్బులు చెల్లించాలి. కానీ డిస్కంలు ఆర్థిక సమస్యతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో సాధ్యం కావడం లేదు. మరోవైపు ఏసీడీ చార్జీల పేరుతో వినియోగదారులపై భారం మోపుతోంది. అయితే ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం ఎటువంటి హామీ ఇస్తుందో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.