కుష్టు వ్యాధి అవగాహనపై సైకిల్ ర్యాలీ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: నేడు అందరికి ఆరోగ్యం అను నాదముతో జరుగుతున్న ఆయుష్మాన్ భవః కార్యక్రమం లో భాగం గా వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వికారాబాద్ యందు కుష్టు వ్యాధి అవగాహన ప్రచార కార్యక్రమము లో భాగముగా సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి మాట్లాడుతూ కుష్ఠు వ్యాధిని మన రాష్ట్రం నుండి, అలాగే మన దేశం నుండి పూర్తిగా పారద్రోలా లని అంటే ముఖ్యంగా 2030 సంవత్సరము నాటికి సమాజంలో కుష్ఠు వ్యాధి వ్యాప్తిని పూర్తిగా అరికట్టాలనే దృక్పథంతో కుష్ఠు వ్యాధి అవగాహన ప్రచార ఉద్యమములో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సాయి చౌదరి కోరారు. ఇంటింటికి వచ్చు ఆషా కార్యకర్తలకు, ఆరోగ్య కార్యకర్తలకు ప్రతి ఒక్కరు సహకరించి తమకు గాని, తమ కుటుంబ సభ్యులకుగాని వ్యాధి లక్షణాలు ఉన్నాయా? లేదా? పరీక్షించుకోవాలని, అలాగే వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే బహుళ ఔషధ చికిత్స ద్వారా వ్యాధి నుండి స్వస్థత పొందవచ్చుఅని శరీరంలో రాగి రంగు లేక గోధుమ రంగు మచ్చలు ఉండి, వాటిపైన స్పర్శ లేకుండా ఉన్న యడల వ్యాధి యొక్క ప్రాథమిక చిహ్నం అని గుర్తించాలని, అలాగే శరీర ఉపరితల నాడులలో వాపు లేక నొప్పి ఉన్న ఎడల కుష్ఠు వ్యాధి యొక్క చిహ్నం గా గుర్తించి దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి బహుళ ఔషధ చికిత్స తీసుకున్న ఎడల ఎటువంటి అంగవైకల్యానికి గురికాకుండా పూర్తి స్వస్థత పొందుతారని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కోశాధికారి డాక్టర్ జి డి నాయుడు మాట్లాడుతూ ముఖం నిండా జిడ్డుగా ఉన్న, చెవి తమ్మెలు వదులుగా ఉన్న, కనుబొమ్మలపై వెంట్రుకలు రాలిపోయినా కుష్ఠు వ్యాధిగా అనుమానించి స్కిన్ స్మియర్ పరీక్ష చేసుకోవాలని, స్కిన్ స్మియర్ పరీక్షలో మైకో బ్యాక్టీరియ సూక్ష్మ క్రిమి కనిపించిన యెడల బహుళ ఔషధ చికిత్స ద్వారా స్వస్థత పొందడమే కాక సమాజంలో కుష్ఠు వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు సహాయపడిన వాళ్లమవుతామని అందువలన ఇంటింటికి వచ్చి సర్వే చేసే ఆరోగ్య కార్యకర్తలకు ప్రజలందరూ పూర్తి సహకారాన్ని అందించాలని, కుష్ఠు వ్యాధి పై ఉన్న భయాలు ఆందోళనలు విడిచిపెట్టి కుష్ఠు వ్యాధిగ్రస్తుల పట్ల ఎటువంటి కళంకితభావం చూపకుండా ప్రజలు ముందుకు వచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది సేవలను పూర్తిగా ఉపయోగించుకోవాలని డాక్టర్ జి డి నాయుడు కోరారు.

Leave A Reply

Your email address will not be published.