తీవ్ర రూపం దాల్చిన మండూస్‌ తుఫాను

- పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో భారీ వర్షాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడి తీరం వైపు దూసుకొస్తున్న మండూస్‌ తుఫాను తీర ప్రాంతాలను ప్రభావితం చేస్తున్నది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో ఈదురు గాలులు జల్లులు మొదలయ్యాయి. పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలో గత కొన్ని గంటల నుంచి ఎడతెరపి లేకుండా సాధారణ వర్షం పడుతున్నది.మండూస్‌ తుఫాను హెచ్చరికల నేపథ్యంలోనే గ్రేటర్‌ చెన్నై కార్పోరేషన్‌ కమిషనర్‌ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. నగరంలోని పార్కులు, ప్లే గ్రౌండ్‌లను మూసివేయించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. మరోవైపు ప్రతికూల వాతావరణం కారణంగా చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలను కూడా నిలిపివేశారు.

Leave A Reply

Your email address will not be published.