నాగచైతన్య దూత వెబ్ సిరీస్ కి డేట్ ఫిక్స్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో, డైరెక్టర్ విక్రమ్ కే. కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన హారర్ వెబ్ సిరీస్ ధూత. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి అయ్యి చాలా కాలం అయ్యింది. అయితే ఈ సిరీస్ రిలీజ్ డేట్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 1, 2023 నుండి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం కానుంది. అయితే దీని పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
నాగ చైతన్య, విక్రమ్ కే. కుమార్ కాంబినేషన్ లో మనం, థాంక్యూ చిత్రాలు వచ్చాయి. మూడోసారి వీరు కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. పార్వతి, ప్రియా భవాని శంకర్ కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.