మద్యపాన వ్యసన విముక్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ప్రభుత్వం మద్యాపాన ఢీ అడిక్ సెంటర్స్(మద్యాపాన వ్యసన విముక్తి కేంద్రాలు) ఏర్పాటు చేసి యువత పెడదారి పట్టకుండా చూడాలని ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ రాష్ట్ర ప్రత్యామ్నాయ రాజకీయ కమిటీ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.శుక్రవారం సికింద్రాబాద్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ లో మద్యం ఏరులై పారుతుందని,చిన్న వయసులోనే మద్యానికి బానిసలై యాక్సిడెంట్ ద్వారా వివిధ రకాల రోగాలతో ప్రాణాలు కోల్పోతున్నారని,వారి భార్యలు  చిన్నతనంలోనే వితంతులు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా హైకోర్టు ఆదేశాలు ఉన్నా,ఆదేశిక సూత్రాలు ఉన్నా తెలంగాణ లో మధ్య నిషేధం చేయలేనప్పుడుప్రతి నియోజకవర్గంలో పది మద్యాపాన వ్యసన విముక్తి డీ అడిక్ సెంటర్లు ఏర్పాటు చేసి జనాలు మద్యానికి బానిసలు కాకుండా చూడాలని కోరారు.అలాగే ఐదువేల కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించి మద్యం బారిన పడకుండా రాష్ట్ర ప్రజలకు డి ఆడిక్ సెంటర్లో అవగాహన తోపాటు మద్యం బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని నాగుల శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు..

Leave A Reply

Your email address will not be published.