శ్రీ సత్యసాయి జిల్లాలో చిరుతల మృతి కలకలం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: శ్రీ సత్యసాయి జిల్లాలో చిరుతల మృతి కలకలం సృష్టిస్తుంది. గంటల వ్యవధిలోనే రెండు చిరుతల మృతదేహాలు లభ్యం కావడంతో అటవీ శాఖ అధికారులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లాలోని మెడకశిరం మండలం మెళవాయి వద్ద నిన్న చిరుత కళేబరాన్ని గుర్తించిన స్థానికులు అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకుని కళేబరాన్ని పరిశీలించి ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటన వెలుగులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే గురువారం ఉదయం అదే సమీప ప్రాంతంలో మరో చిరుత కళేబరాన్ని గుర్తించిన అటవి సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అయితే గురువారం చిరుత కళేబరం వద్ద మేకకళేబరం కూడా ఉండడంతో అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మేకను తినడం వల్ల గాని , అనారోగ్యం వల్లగాని చిరుత చనిపోయి ఉండవచ్చని తెలిపారు. చిరుతపై ఎలాంటి గాయాలు లేవని వెల్లడించారు. చిరుతకు పోస్టుమార్టం అనంతరం వచ్చే నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు తెలుస్తాయని అధికారులు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.