నాంపల్లి కోర్టుకు దీపదాస్ మనిషి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఏఐసీసీ ఇంచార్జ్ () దీపాదాస్ మున్షి (Dipadas Munshi) శుక్రవారం నాంపల్లి కోర్టు (Nampalli Court)కు హాజరయ్యారు. బీజేపీ నేత (BJP Leader) ప్రభాకర్ (Prabhakar) చేసిన వ్యాఖ్యల విషయంలో ఆమె పరువునష్టం కేసు (Defamation case) వేశారు. ఈ పిటిషన్‌ (Petition)పై శుక్రవారం నాంపల్లి కోర్టు విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో దీపాదాస్ మున్షి కోర్టుకు హాజరయ్యారు. ఆమెకు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీలు (Congress MPs), మాజీ ఎంపీలు (Ex MPs) కార్యకర్తలు (Activists), నాంపల్లి కోర్టుకు వచ్చారు. బీజేపీ నేత ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై దీపాదాస్ మున్షి పరువునష్టం కేసు వేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ నాంపల్లి కోర్టు విచారణ చేస్తోంది.

కాగా కాంగ్రెస్ పార్టీ నేతలకు పదవులు, ఎన్నికల్లో టికెట్లు ఇప్పించేందుకు ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి బెంజ్ కార్లు గిఫ్ట్ తీసుకుంటున్నారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాక‌ర్. సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ అంటేనే అవినీతి, అక్రమాలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు తన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయంటూ ప్రభాకర్ చెబుతుండటం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ప్రభాకర్ విమర్శలను కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టారు. ఈ క్రమంలో ప్రభాకర్‌ చేసిన ఆరోపణలపై దీపాదాస్‌ మున్షీ సీరియస్ అయ్యారు.

 

Leave A Reply

Your email address will not be published.