యాదాద్రి థర్మల్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్‌కు కేంద్ర అనుమతుల జాప్యం

వండిపడ్డ మంత్రి జగదీష్ రెడ్డి

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: యాదాద్రి థర్మల్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్‌కు కేంద్ర అనుమతుల జాప్యంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఉచిత విద్యుత్ ప్రతిపక్షాలకు కంటగింపుగా మారింద‌ని మండిప‌డ్డారు. మోదీ రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా మొండి చేతులే చూపిస్తున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ పర్యటనలోనైనా మోదీ యాదాద్రి విద్యుత్ ప్లాంట్‌కు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కావాలనే ఆటంకాలు సృష్టించి అనుమతులు ఇవ్వడంలేదన్నారు. తొమ్మిది నెలల్లో టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వాలన్న ఎన్‌జీటీ ఆదేశాల‌ను కేంద్రం బేఖాతర్ చేస్తుంది. ఎన్‌జీటీ ఆదేశాల ప్రకారం అనుమతులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.నిర్మాణం పూర్తయి సిద్ధంగా ఉన్న అనుమతులు రావడం లేద‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి తెలిపారు. మోదీ జోక్యం చేసుకుని కేంద్ర మంత్రికి ఆదేశం ఇవ్వాలి. రాష్ట్రంలోకి అడుగు పెట్టే ముందే ఆదేశాలు ఇచ్చి రావాలని డిమాండ్ చేశారు. మాటల్లో దేశభక్తి చూపిస్తూ.. చేతల్లో మోదీ దేశ ద్రోహం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అభివృద్ధి చెందుతున్న వారికి ప్రోత్సహం ఇవ్వకపోగా ఆటంకాలు కల్పిస్తున్నారు. రాష్ట్ర రైతాంగానికి గుండెకాయగా మారుతుందనే యాదాద్రి ప్లాంట్‌పై కుట్ర చేస్తున్నారు. పూర్తయిన ప్లాంట్‌ని ప్రజలకు అందుబాటులోకి రాకుండా ద్రోహం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు జరుగుతున్న కుట్రలను అర్ధం చేసుకోవాల‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి సూచించారు.

 

 

Leave A Reply

Your email address will not be published.