ఢిల్లీ తో పాటు పలు రాష్ట్రాల్లోడెంగ్యూ కేసులు నమోదు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ విజృంభిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీ, ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాలు నమోదవుతున్నాయి. డెంగ్యూ జ్వరం దోమల ద్వారా సంక్రమించే వైరల్‌ వ్యాధి. ప్రధానంగా ఈడిస్‌ దోమల ద్వారా వ్యాపిస్తుంది. డెంగ్యూ సోకిన సమయంలో అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్లు, కండరాల నొప్పి, దద్దుర్లు, ఫ్లూ వంటి లక్షణాలుంటాయి. తీవ్రమైన సందర్భాల్లో.. డెంగ్యూ హెమరేజిక్ జ్వరానికి దారితీస్తుంది. ఇది ప్రాణాంతక పరిస్థితని తలెత్తుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ముందస్తుగా చర్యలు తీసుకోవడం కీలకం. అయితే, డెంగ్యూ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు చిట్కాలు పాటిస్తే తమను తాము కాపాడుకున్న వారమవుతాం..

దోమలు వృద్ధికాకుండా చూసుకోండి..

డెంగ్యూ నుంచి మిమ్మల్ని మీరు నిరోధించుకోవడానికి కీలకమైంది. దోమల వృద్ధి చేయకుండా చూసుకోవాలి. దోమలు నిలకడగా ఉన్న నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి. పూల కుండీలు, కుండీలు, బకెట్‌లు వంటి వాటిలో నీటిని నిల్వకాకుండా చూసుకోవాలి. అలాగే దోమల బెడదను తగ్గించకునేందుకు ఇంటి పరిసరాల్లో ఎలాంటి నీటి నిల్వకుండా చేసుకోవాలి.

మస్కిటో రిపెల్లెంట్స్ ఉపయోగించాలి..

దోమలను కుట్టకుండా దోమల వికర్షకాలను వినియోగించాలి. దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లిన సమయంలో వికర్షకాలను ఉపయోగించాలి. మస్కిటో రిపెల్లెంట్స్‌ దోమల బారి నుంచి మిమ్మల్ని సంరక్షిస్తాయి. కలబంద సహజ పదార్థాలతో తయారు చేసిన మస్కిటో రిపెల్లెంట్స్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా వాటిని ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంది. ఈ స్వచ్ఛమైన సిట్రోనెల్లా, యూకలిప్టస్ ఆయిల్ నాలుగైదు చుక్కలు దుస్తులపై వేసినా దోమల బారి నుంచి కాపాడుతుంది.

శరీరాన్ని కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి..

బయటికి వెళ్లినప్పుడల్లా పొడవాటి చేతులను కప్పి ఉంచేలా చొక్కాలు, పొడవాటి ప్యాంటు, సాక్స్, షూలను ధరించాలి. ముఖ్యంగా దోమలున్న ప్రాంతాలకు వెళ్లే ప్రాంతాలకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. దుస్తులు లేత రంగులో ఉన్నవి ధరించడం మేలు. అవి దోమల కాటును తగ్గిస్తాయి. దోమలు ముదురు రంగు దుస్తులు దోమలను బాగా ఆకర్షిస్తాయి. కాబట్టి లేత రంగు దుస్తులు ధరించాలి.

దోమతెరలను వాడాలి..

ఇంట్లోకి దోమలు రాకుండా విండో స్క్రీన్‌లను ఇన్‌స్టాల్ చేయాలి. తలుపులు, కిటికీల ద్వారా ఇంట్లోకి రాకుండా డోర్‌నెట్‌లు వాడాలి. నిద్రపోయే సమయంలో బెడ్ నెట్‌లను వాడుకోవాలి. ప్రత్యేకించి డెంగ్యూ వ్యాప్తి చెందుతున్న ప్రాంతంలో నివసిస్తుంటే.. డెంగ్యూ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి బెడ్ నెట్‌లను ఉపయోగించాలి. దాంతో డెంగ్యూ బారినపడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పరిశ్రుభంగా ఉండేలా చూసుకోవాలి..

దోమలు వ్యాప్తిచెందకుండా ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి చుట్టుపక్కల ఏవైనా మొక్కలు ఉంటే.. వాటిని పొదలను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మొక్కల పొదలను క్రమం తప్పకుండా కత్తిరించడం చాలా అవసరం.. లేకుంటే దోమలు మొక్కలను కొమ్మలను ఆశ్రయిస్తాయి. అదే సమయంలో చెత్తను ఎక్కడ పడితే అక్కడ సరిగ్గా పారవేయాలి. వ్యర్థాలు పేరుకుపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే దోమల సంతానోత్పత్తికి చెత్త కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.