దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న డెంగ్యూ..చికున్‌గున్యా..         

  యూపీలో 24 మంది మృతి..!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో డెంగ్యూ, చికున్‌గున్యా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ రాజధాని ప్రాంతంతో పాటు ఉత్తరభారతంలో చాలామంది వైరస్‌లతో బాధపడుతున్నారు. డెంగ్యూతో ఆసుపత్రుల్లో రోగుల సంఖ్యతో పాటు మరణాలు పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, పంజాబ్‌ డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు దోమలబారినపడకుండా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పగటిపూట ఎక్కువడగా డెంగ్యూ వ్యాధిని కలిగించే దోమలు ఎక్కువగా కుడదాయని, శరీర భాగాలను కప్పి ఉంచేలా దుస్తులను ధరించాలని సూచిస్తున్నారు.

యూపీబిహార్‌లో దారుణంగా..

ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లో పరిస్థితి దారుణంగా ఉన్నది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే డెంగ్యూ ఉధృతమవుతున్నది. ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు డెంగ్యూతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ నమోదవుతున్న కేసులను పరిగణలోకి తీసుకుంటే మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 13వేలు దాటింది. గత 24గంటల్లో కొత్తగా 600పైగా కేసులు నమోదయ్యాయి. అలాగే, బీహార్‌లో గత 24 గంటల్లో 373 కొత్త కేసులు నమోదయ్యాయి. పాట్నా జిల్లాలోనే అత్యధికంగా 178 కేసులు రికార్డయ్యాయి.ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో డెంగ్యూ కేసుల సంఖ్య 11,675 చేరింది. అక్టోబర్‌లోనే 4,940 కేసులు నమోదయ్యాయి. జ్వరంతో వస్తున్న చాలా మందికి డెంగ్యూ నిర్ధారణ అవుతుందని గ్రేటర్‌ నోయిడా ఎమర్జెన్సీ విభాగానికి చెందిన డాక్టర్‌ అమీర్‌ సిద్ధిఖీ తెలిపారు. రక్తంలో ప్లేట్‌లెట్స్ వేగంగా పడిపోతున్నాయని, దీంతో తీవ్రమైన హెమరేజిక్‌ డెంగ్యూకి కారణమయ్యే అవకాశాలున్నాయన్నారు. అలాంటి వారిని ఆసుపత్రిలో చేర్చాల్సి ఉంటుందని.. తీవ్రమైన సందర్భాల్లో చికిత్స ఆలస్యమైతే ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందన్నారు.

ఢిల్లీలో వేగంగా పెరుగుతున్న డెంగ్యూ కేసులు

ఢిల్లీలో నెలన్నర నుంచి డెంగ్యూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆగస్టు 5 నాటికి రాష్ట్రంలో డెంగ్యూ కేసుల సంఖ్య 348 ఉండగా.. సెప్టెంబర్ చివరి నాటికి 3,200పైగా పెరిగింది. డేటా ప్రకారం.. డెంగ్యూ తీవ్రమైన డీఈఎన్‌-2 జాతిని గుర్తించారు. దీని కారణంగా తీవ్రమైన వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. డెంగ్యూ, మలేరియా, చికున్‌ గున్యాకు సంబంధించి దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో గత మూడేళ్లలో నాలుగు కుటుంబాల్లో ఓ కుటుంబం దోమలద్వారా వచ్చే వ్యాధులతో బాధపడుతున్నట్లుగా తేలింది.

Leave A Reply

Your email address will not be published.