అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో బాల్యవివాహాలు తగ్గాయి

- విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో బాల్యవివాహాలు తగ్గాయని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.శనివారం మహేశ్వరం మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిషన్‌ భగీరథ పథకం ద్వార ప్రతి ఇంటికి మంచి నీళ్లు అందించి మహిళల ఆత్మగౌరవం కాపాడిన ఘనత ముఖ్య మంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు.ఎనిమిది సంవత్సరాల కాలంలో 2020 మందికి గాను రూ.21కోట్ల రూపాయల చెక్కులను అందజేశామన్నారు. పేదింటి ఆడ బిడ్డలకు ముఖ్య మంత్రి కేసీఆర్‌ మేనమామలాగా ఆదుకుంటున్నారని తెలిపారు. ధరఖాస్తులు చేసుకున్న ప్రతి ఒక్కరికి పథకం వలన లబ్ధి చేకూరిందన్నారు.ఎలాంటి పైరవీలకు తావు లేకుండా ప్రభుత్వ పథకాలు లబ్ధి దారులకు చేరుతున్నాయన్నారు. అమ్మాయిలలో అక్షరాస్యత శాతం పెరగడమే కాకుండా ఉన్నత చదువులపై దృష్టి సారించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్‌ ఎంపీపీసునితా అంధ్యనాయక్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.