రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి పెద్దపీట

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమం లో క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ గా డాక్టర్ ఇ. ఆంజనేయ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్క్రీడాపర్యాటకసాంస్కృతికపురావస్తు శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు రాష్ట్రం లో అందిస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు నగదు పురస్కారాలను ఘననియంగా పెంచదం జరిగిందన్నారు. నిజామాబాద్ బిడ్డ నిక్కత్ జరీన్ షూటింగ్ క్రీడాకారిణి ఇషా సింగ్ లకు ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయల నగదు పురస్కారాన్ని అందించినట్లు తెలిపారు.బంజారాహిల్స్ హిల్స్ లో ఇంటి జాగాలను కేటాయించామన్నారు.ప్రభుత్వానికి చైర్మన్ లు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. క్రీడా పాలసీ ని త్వరలో ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో MP రాములు, MLC లు కల్వకుంట్ల కవితబండ ప్రకాష్ప్రభుత్వ విప్ బాల్క సుమన్, MLA లు క్రాంతి కిరణ్మనోహర్ రెడ్డిమాజీ MLA బానోతు చంద్రావతిమాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, BC కమిషన్ సభ్యులు కిషోర్ప్రభుత్వ కార్పోరేషన్ చైర్మన్ లు డా. ఆయాచితం శ్రీధర్జులూరి గౌరీ శంకర్సాయి చంద్రాజీవ్ సాగర్వాసుదేవ రెడ్డిసతీష్ రెడ్డిశ్రీధర్ రెడ్డిబాలరాజు యాదవ్బండారి భాస్కర్తదితర ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.