సరికొత్త థీమ్‌తో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల అభివృద్ధి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను సరికొత్త థీమ్‌తో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వెల్లడించారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు, కోటి వృక్షార్చనలో భాగంగా మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్కును మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, మ‌హేంద‌ర్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. అనంతరం పార్కులో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పిలుపు మేర‌కు అర్బన్ లంగ్ స్పేస్ లో భాగంగా ప‌ట్టణ‌, న‌గ‌రవాసుల‌కు మానసిక ఉల్లాసం, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.  హ‌రిత‌హారం కార్యక్రమంలో ఇప్పటి వ‌ర‌కు 283 కోట్ల మొక్కలు నాటామ‌ని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులకు గాను 74 పార్కులను ప్రజ‌ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు.గ‌తంలో డంపింగ్ యార్డుగా మారిన ఈ ప్రాంతాన్ని అట‌వీ అభివృద్ధి సంస్థ అర్బన్ ఫారెస్ట్ పార్కుగా తీర్చిదిద్దడంతో ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచే పార్కుగా మారింద‌న్నారు. ఫారెస్ట్ ట్రెక్ పార్కుకు సంద‌ర్శకుల తాకిడి పెరిగింద‌ని ప్రతీ రోజు 3 వేల మంది, వీకెండ్ లో 5 వేల మంది పార్కులో సేద‌తీరుతున్నార‌ని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.