రైతుల పాలిట శాపంగా మారిన ధరణి అనే పోర్టల్

రైతుల సమస్యల తీర్చడంలో విఫలం చెందిన ఉన్నంత అధికారులు  జోగులాంబ గద్వాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు  తట్టే మహేష్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జోగులంబ గద్వాల జిల్లా  కేంద్రంలో అనేక గ్రామాలలో గత 2014 సంవత్సర కాలం నుంచి ఇప్పటివరకు అనేకమంది రైతులు పొలాల సమస్యలు తీరక నానా ఇబ్బందులు పడుతున్నారని జోగులాంబ గద్వాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు  తట్టే మహేష్  తెలిపారు. ,రైతులు వ్యవసాయం చేసే పొలాల యొక్క పట్టా పాస్ పుస్తకాలు రాక ఆఫీసుల చుట్టూ ప్రతిరోజు, రైతుల యొక్క పొలాల రికార్డులను అధికారులు సరిగా పొందుపరచందున ప్రతిరోజు కన్నీటి చుక్క, గత కొన్ని సంవత్సరాలు కావస్తున్న రైతులు తమ యొక్క వ్యవసాయ పొలాన్ని వ్యవసాయం చేస్తున్న ఆ యొక్క పొలాన్ని ఆన్లైన్లో చూపించడం లేదని పలుమార్లు అధికారులకు దృష్టికి తీసుకెళ్లిన పరిష్కారం లభించక  రైతులపట్ల శాపంగా మారిందని పేర్కొన్నారు. వ్యవసాయం చేసే రైతులు తమ యొక్క పొలాలు ఎక్సెస్ లో ఉన్న పొలాలను సరిచేసి ఎవరైతే నిజ రైతు ఉంటాడో ఆ యొక్క రైతు పొలాన్ని ఎక్సెస్ లో తొలగించండి అని అనేకసార్లు కిందిస్థాయి నుండి పై స్థాయి ఉన్నంత అధికారులకు మొర్రిపెట్టి చెప్పిన చెవికెక్కనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికారులు, రైతులు వారి యొక్క పొలాలను సేద్యం చేస్తున్న కొంతమంది కబ్జాదారుల భయం వల్ల తమ యొక్క పొలాలను మధ్యలో వదిలేసి వలస ప్రయాణం, ఇప్పటివరకు అనేక గ్రామాలలో అనేక సర్వే నంబర్లలో రైతుల వ్యవసాయ భూములు సంవత్సరాలు గడిచిన అలాగే ఎక్సెస్ లో ఉండిపోయిన భూములను అధికారులు నిర్లక్ష్యం వైఖరి వల్ల రైతులు ప్రతిరోజు తాసిల్దార్ కార్యాలయాల  చుట్టూ కాలకేసుకున్న చెప్పులు అరిగిపోయేంతవరకు తిరుగుతున్న చెవికెక్కినట్టు వ్యవహరిస్తున్న కింది స్థాయి అధికారుల నుండి పై అధికారుల వరకు, రైతులకు సహాయం చేసే అధికారులే ఇలా నిర్లక్ష్యంగా ఉంటే రైతుల యొక్క బాగోగలను చూసే నాధుడు ఎవరని ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నంత అధికారులు స్పందించి రైతుల యొక్క సమస్యలను తీరుస్తూ రైతుల ముఖంలో చిరునవ్వును చూపించగలరని జోగులాంబ గద్వాల జిల్లా  బీసీ అధ్యక్షులు తట్టే  మహేష్ డిమాండ్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.