జీవనశైలి, ఆహారపు అలవాట్లు వల్లే మధుమేహం        

- మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ లిల్లీ మేరి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: జన్యు కారణాల వల్ల వచ్చే మధుమేహాని పక్కన పెడితే, ఈ మధ్యకాలంలో ఎక్కువమందికి జీవనశైలి, ఆహారపు అలవాట్లు వల్లే మధుమేహం వస్తుందని ఇది అన్ని వయసుల వారిలోనూ కనిపించడం ఒక ప్రమాదకరమైన సంకేతం అని దీనికి కొన్ని కారణాలు ఉన్నాయని మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ లిల్లీ మేరి అన్నారు. నేడు మదర్ మీరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలాజీ నగర్లో ఉచిత మధుమేహా రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది.  ఈ సందర్భంగా మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ లిల్లీ మేరి  మాట్లాడుతూ మన శరీరానికి అవసరమైన శక్తి మనం చేసే శారీరక శ్రమపై కూడా ఆధారపడి ఉంటుందని, తక్కువ శారీరక శ్రమ చేసేవారు ఎక్కువ ఆహారాన్ని తింటే ప్రతికూల ఫలితాలు వస్తాయని, అదనముగా చేరిన గ్లూకోజు కాలేయంలోను, పొట్టలోను కొవ్వు రూపంలో పేరుకు పోతుందన్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే మధుమేహానికి రివర్స్ గేరు వేయటం సాధ్యమవుతుందని లిల్లీ మేరి  తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.