అస్సలు వర్షాలే కురవని ఒక గ్రామం ఒకటుందని మీకు తెలుసా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బ్యూరో చీఫ్: అస్సలు వర్షాలే కురవని ఒక గ్రామం భూమి మీద ఉందన్న విషయం తెలుసా?అవునండీ యెమెన్‌ దేశంలో ఉన్న అల్‌ హుతైబ్‌ గ్రామంలో సంవత్సరం మొత్తంలో ఒక్కసారి కూడా వర్షం పడదు. ఈ భూమ్మీద ఒక్కో చోట ఒక్కో వాతావరణం కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఎండలు మండిపోతే.. మరికొన్ని చోట్ల మంచు కప్పేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చలి వణికిస్తే.. మరికొన్ని ప్రాంతాల్లో నెలల తరబడి వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ఇలా ఒక్కో చోట ఒక్కో వాతావరణ పరిస్థితి ఉంటుంది.

వర్షం ఎందుకు పడదంటే..

యెమెన్‌ రాజధాని సనాకు పశ్చిమ దిశలో అల్‌ హుతైబ్‌ అనే గ్రామం ఉంది. ఇది భూ ఉపరితలానికి 3200 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది మేఘాలు ఉండే ప్రాంతానికంటే కూడా ఎత్తు అన్నమాట. అంటే.. ఈ గ్రామంలో మేఘాలు మన కాళ్ల కింద ఉంటాయి. వీటిని ఈజీగా చేతులతో తాకొచ్చు. మేఘాల కన్నా ఎత్తులో ఈ గ్రామం ఉంది కాబట్టే ఇక్కడ ఎప్పుడూ వర్షం కురవదు. వర్షాలు పడకపోవడం ఒక్కటే కాదు అల్‌ హుతైబ్‌ గ్రామంలో వాతావరణం పూర్తిగా డిఫరెంట్‌గానే ఉంటుంది. ఉదయం సూర్యుడు ఉదయించేంత వరకు ఈ గ్రామాన్ని చలి కప్పేస్తుంది. సూర్యుడు ఉదయించగానే ఎండలు మండిపోతాయి. మళ్లీ సూర్యుడు అస్తమించగానే ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతాయి.

ఇక్కడి ప్రజలు ముంబై నుంచి వెళ్లినవాళ్లే..

అల్‌ హుతైబ్‌ గ్రామంలో అల్‌ బోహ్రా ( అల్‌ ముఖర్మ ) తెగలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉంటారు. వీరిని యెమెన్‌ కమ్యూనిటీస్‌గా పిలుస్తారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. వీళ్లు మన ముంబై నుంచి వెళ్లినవాళ్లే. ముంబైకి చెందిన మహమ్మద్‌ బుర్హానుద్దీన్‌ నేతృత్వంలోని ఇస్మాయిలీ విభాగం నుంచి వచ్చి అల్‌ హుతైబ్‌లో స్థిరపడ్డారు.

టూరిస్ట్‌ల ఫేవరేట్‌ స్పాట్

మేఘాల కంటే ఎత్తులో ఉండటంతో ఈ వింతైన గ్రామం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. మేఘాలపై నిలబడి వర్షం భూమి మీద పడే సుందర దృశ్యాన్ని చూసేందుకు అల్‌ హుతైబ్‌ గ్రామానికి ఏటా వేలాది మంది టూరిస్టులు వస్తుంటారు. కొండపై నుంచి కిందకు వెళ్తూ వర్షా్న్ని తాకుతూ ఎంజాయ్‌ చేస్తుంటారు.

Leave A Reply

Your email address will not be published.