ఏసీ రైళ్లలో ప్రయాణ చార్జీల్లో డిస్కౌంట్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రైల్వే ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. సీటింగ్ అకామడేషన్ ఉన్న ఏసీ రైళ్లలో ప్రయాణ ఛార్జీల్లో డిస్కౌంట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టాలని రైల్వే జోన్లను ఆదేశించింది. గడచిన 30 రోజుల్లో 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న ఈ రైళ్లలో ఈ ఆఫర్‌ను ప్రకటించాలని తెలిపింది. రైళ్లలో వసతులు సాధ్యమైనంత ఎక్కువగా వినియోగమయ్యే విధంగా చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.ఇటువంటి ఏసీ రైళ్ల ప్రయాణ ఛార్జీల్లో డిస్కౌంట్ ఆఫర్ వెంటనే అమల్లోకి వస్తుందనిఅయితే ఇప్పటికే టిక్కెట్లను బుక్ చేసుకున్నవారికి ఈ ఆఫర్ వర్తించదనిఎటువంటి తిరిగి చెల్లింపులు ఉండబోవని వివరించింది.

డిస్కౌంట్ పథకం వివరాలు :

– ఏసీ చైర్ కార్ఎగ్జిక్యూటివ్ క్లాసెస్‌కు మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. అనుభూతివిస్టాడోమ్ బోగీలు ఉన్న రైళ్లు సహా ఏసీ సిట్టింగ్ అకామడేషన్ ఉన్న అన్ని రైళ్లకూ వర్తిస్తుంది.

– టిక్కెట్ మూల ఛార్జీలో గరిష్ఠంగా 25 శాతం డిస్కౌంట్ ప్రయాణికునికి లభిస్తుంది. అయితే రిజర్వేషన్ ఛార్జీలుసూపర్‌ఫాస్ట్ ఛార్జీలుజీఎస్‌టీ వేర్వేరుగా విధిస్తారు.

– వందే భారత్ రైళ్లలో గడచిన 30 రోజుల్లో 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లలో బేస్ ఫేర్ (మూల ఛార్జీ)పై గరిష్ఠంగా 25 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

– ఈ డిస్కౌంట్ పథకం గరిష్ఠంగా ఆరు నెలలపాటు అమలవుతుంది. డిమాండ్‌నుబట్టి నెలవారీ లేదా సీజనల్ లేదా వారాంతపు రోజులు ఈ పథకం అమలవుతుంది.

– ఈ రైళ్లలో ఆక్యుపెన్సీ ఆధారంగా ఈ పథకాన్ని సమీక్షించిపొడిగించడమాఉపసంహరించడమాఅనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు.

– సెలవులుపండుగల సమయంలో నడిపే ప్రత్యేక రైళ్లకు ఈ పథకం వర్తించదు.

Leave A Reply

Your email address will not be published.