రైలు ప్రమాద బాధితులకు నష్టపరిహారం చెక్కులు అందజేత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కంటకాపల్లి రైలు ప్రమాదంలోని బాధితులు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ నేరుగా ఆసుపత్రికి వెళ్లి బాధితులందరినీ పరామర్శించారు. సిఎం ఆదేశాల మేరకు … మంగళవారం ప్రభుత్వాసుపత్రిలోని బాధితులకు ఆస్పత్రిలోనే నష్టపరిహారం చెక్‌లను జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావులు అందజేశారు. 10 మందికి రూ.5 లక్షలు, ముగ్గురుకి రూ.10లక్షలు, మిగతావారికి రూ.2 లక్షలు చొప్పున.. మొత్తం క్షతగాత్రులకు కోటి 32 లక్షలను ఎపి ప్రభుత్వం అందజేసింది. 13 మంది మృతులకు రూ. 10 లక్షలు చొప్పున.. రూ.2 కోట్ల 62 లక్షలు అందచేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికార యంత్రాంగాన్ని సిఎం జగన్‌ ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.