మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దోమతెరలు పంపిణీ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కుష్టు వ్యాధి  గ్రస్తులకు మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ ఆద్వర్యం లో  బోరబండ లెప్రసీ కాలనీ యందు గల లెప్రసీ వ్యాధిగ్రస్తులకు దోమతెరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా. మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ లిల్లీ మేరి మాట్లాడుతూ ఒక వైద్య పరమైన సమస్య మాత్రమే కాకుండా ఇదో సామాజిక సమస్య  అని రోగి నుండి పీల్చే గాలి ద్వారా, స్పర్శ ద్వారా, సానిహిత్యం ద్వారా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుందని , ఇది ఒక అంటువ్యాధి అని, బహుళ ఔషధ చికిత్స (MDT) ద్వారా దీన్ని నయం చేయవచ్చు అని,  ప్రారంభంలోనే జబ్బును గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే సులభముగా అంగవైకల్యం రాకుండా కుష్టు వ్యాధిగ్రస్తులను కాపాడుకోవచ్చని లిల్లీ మేరి అన్నారు. మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుష్టు వ్యాధి నివారణ మార్గాలపై అవగాహన కార్యక్రమాలను, వ్యాధి వ్యాపించే విధానము, చికిత్స విధానము, వ్యాధిగ్రస్తుల పట్ల ఎలా వ్యవహరించాలనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తద్వారా వ్యాధి వ్యాప్తిని చాలా వరకు అరికట్టగలిగేటట్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ లిల్లీ మేరి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.