పోచమ్మ ఆలయానికి స్టీల్ ప్లేట్ల వితరణ
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్ బీర్కూర్: బీర్కూర్ మండల కేంద్రం లోని బీర్కూర్ గ్రామ దేవత పెద్ద పోచమ్మ ఆలయానికి శనివారం రోజు గ్రామానికి చెందిన డిప్యూటీ కమిషనర్ జిఎస్టి చిత్రంపల్లి హన్మాండ్లు 100 స్టీల్ ప్లేట్స్ ను ఆలయ కమిటీ సభ్యులకు అందించారు.
పండగలు, దేవి నవరాత్రి ఉత్సవాలలో ఆలయంలో నిర్వహించే అన్నదానం కార్యక్రమానికి ఉపయోగంగా ఉంటుందని స్టీల్ ప్లేట్స్ అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మేకల పవన్, బోనగిరి అనిల్, నారమ్ ప్రవీణ్, మద్నూర్ శంకర్, వార్డ్ సభ్యుడు మేకల రాములు, ప్రభుత్వ ఉపాద్యాయుడు మేకల విట్టల్, మేకల గాలయ్య, కొట్టూరి ప్రవీణ్ కుమార్ గుప్త, సింగని విట్టల్ భక్తులు ఉన్నారు.