స్వచ్ఛ సర్వేక్షణ్‌ నెల ర్యాంకుల్లో ఆగ్రభాగానా తెలంగాణ జిల్లాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: స్వచ్ఛ సర్వేక్షణ్‌ఫిబ్రవరి నెల ర్యాంకుల్లో తెలంగాణ జిల్లాలు ఆగ్రభాగానా నిలిచాయి. ఫైవ్‌, ఫోర్‌ స్టార్‌ కేటగిరిల్లో ఫిబ్రవరి మాసానికి సంబంధించిన ర్యాంకుల్లో తెలంగాణ జిల్లాలు ముందు నిలిచి మరోసారి తమ సత్తాను చాటాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ర్యాంకులను బుధవారం స్వచ్ఛ భారత్‌ అధికారులు ప్రకటించారు. వీటిల్లో 5 స్టార్‌ కేటగిరిలో తెలంగాణకు చెందిన కరీంనగర్‌, సిరిసిల్ల జిల్లాలు ముందు నిలిచాయి. ఇందులో డయ్యూ డామన్‌, దాద్ర నగర్‌ హావేళి రాష్ట్రాలకు చెందిన జిల్లాలు మాత్రమే తెలంగాణతో పోటీ పడ్డాయి. మిగిలిన రాష్ట్రాలకు చెందిన ఏ జిల్లాలు కూడా తెలంగాణకు సమీపంలో కూడా లేవు.4 స్టార్‌ రేటింగ్‌లో తెలంగాణకు చెందిన పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాలు మూడు, ఐదో స్థానంలో నిలిచాయి. త్రీ స్టార్‌ రేటింగ్‌లో కొత్తగూడెం జిల్లా ఆరో స్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌కు సంబంధించి ఆయా జిల్లాల పనితీరు ఆధారంగా, కేంద్రం నిర్దేశించిన ప్రమాణాలను పాటించిన జిల్లాలకు ప్రతి నెలా ర్యాంకులు కేటాయిస్తున్నారు. వన్‌ స్టార్‌ నుంచి ఫైవ్ స్టార్‌ వరకు కేటగిరిలుగా విభజిస్తూ ప్రతి నెలా ఒకటో తేదీన ర్యాంకులు ప్రకటిస్తున్నారు. ఇటివలే త్రైమాసికం ర్యాంకులను సైతం ప్రకటించారు. అందులోనూ తెలంగాణ ముందు నిలిచింది.

Leave A Reply

Your email address will not be published.