రైతుబంధు నిధుల‌ను పాత బ‌కాయిల కింద జ‌మ చేయొద్దు

- మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర ఆగ్ర‌హం

తెలంగాణ జ్యో/వెబ్ న్యూస్:   రైతుబంధు నిధులను కొందరు బ్యాంకర్లు రుణాలు, ఇతర బకాయిల కింద‌ జమ చేసుకోవడంపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతుబంధు నిధులు బ్యాంకు దాటి రైతుల ఖాతాలకు రావడం లేదన్న క‌థ‌నాల‌పై హ‌రీశ్‌రావు స్పందించారు.ఈ విషయమై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితిని మంత్రి ఆదేశించారు. రైతుబంధు నిధులను ఎట్టిపరిస్థితుల్లోనూ బకాయిలకు జమ చేసుకోరాదని మంత్రి స్పష్టం చేశారు. స్టేట్ లెవ‌ల్ బ్యాంక‌ర్స్ క‌మిటీ(ఎస్ఎల్బీసీ) నిబంధనలను బ్యాంకర్లు అందరూ విధిగా పాటించాలని పేర్కొన్నారు. పంట పెట్టుబడి సాయం కోసం రైతుబంధు ద్వారా రైతులకు ఇచ్చే నగదు మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేయాలని మంత్రి సూచించారు.భవిష్యత్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా అన్ని బ్యాంకులు ఎస్ఎల్‌బీసీ నిబంధ‌న‌ల ప్రకారం రైతుబంధు పంట పెట్టుబడి సహాయాన్ని పాత బకాయిల కింద జమచేయకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించవలసిందిగా మంత్రి ఆదేశించారు. ఈ ఘ‌టనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఎస్ఎల్‌బీసీ సెక్ర‌ట‌రీని మంత్రి కోరారు.

Leave A Reply

Your email address will not be published.