సిల్వర్ జూబ్లీ ప్రశంసా పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ బాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈ రోజు హైదరాబాదులోని తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిల్వర్ జూబ్లీ ప్రశంస పురస్కారానికి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలు కు డాక్టర్ ప్రీతి మీనా ఐఏఎస్ మరియు తలసేమియా బ్లడ్ బ్యాంక్ నిర్వాహకురాలు రత్నావళి గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి వ్యక్తిగతంగా 67 సార్లు,రక్తదాతల సమూహం ద్వారా 15 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని,కరోనా సమయంలో 100 యూనిట్ల ప్లాస్మాను,డెంగ్యూ వ్యాధి సమయంలో ప్లేట్ లెట్స్ ను అందించడమే కాకుండా తల సేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం రక్తదాన శిబిరంలో 189 యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకుగాను ఈ పురస్కారాన్ని అందజేయడం జరిగిందని,ఈ అవార్డు రావడానికి కారణం తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా సూచనల మేరకే కామారెడ్డి జిల్లా కేంద్రంలో తల సేమియా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.ఈ అవార్డు నా వ్యక్తిగత విజయం కాదని రక్తదానానికి సహకరిస్తున్న రక్తదాతలకు,ప్రోత్సహిస్తున్న వారికి,పత్రిక ప్రతినిధులందరికీ చెందుతుందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.