భారత్ కీలక స్ధావరాల పై డ్రాగన్ కన్ను ?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తనచుట్టుపక్కలున్న అన్నీ దేశాలను ఏదోరూపంలో కబళించాలని చూస్తోంది చైనా.  అప్పులిచ్చి ఇచ్చి తిరిగి చెల్లించలేని పరిస్ధితికి తీసుకొచ్చేసి పాకిస్ధాన్ను తర్వాత శ్రీలంకలో కొంత భూభాగాన్ని ఒకరకంగా కబ్జా చేసేసింది. తర్వాత నేపాల్ బంగ్లాదేశ్ విషయంలో కూడా చైనా ఇలాగే వ్యవహరిస్తోంది. అంటే భారత్ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ చైనా వ్యూహాత్మకంగా పట్టుబిగించేస్తోంది. ఇవన్నీ సరిపోవన్నట్లు అండమాన్ నికోబార్ దీవుల్లో తిష్టవేయటానికి డ్రాగన్ అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు బయటపడింది.

భారత్ తో మంచి సంబంధాలు మైన్ టైన్ చేసేందుకు పాశ్చాత్యదేశాలు చాలా ఉత్సాహం చూపిస్తున్నాయి. ఎందుకంటే భారత్ మీద ప్రేమ పొంగిపోయి కాదు. హిందూ మహాసముద్రంలో వ్యాపారపరంగా భారత్ కీలకమైన వ్యూహాత్మక పాయింట్ లో ఉండటమే. ఆ వ్యూహాత్మకమైన పాయింట్ అండమాన్ నికోబార్ దీవులకు దగ్గర్లో ఉంది. దీని పైన భారత్ దే సంపూర్ణ ఆధిపత్యం. పసిఫిక్-హిందు మహాసముద్రం గుండా జరగాల్సిన వ్యాపారానికి షార్ట్ కట్ మార్గమే మలక్కా.

ఈ మలక్కా మార్గంలో ఏడాదికి 90 వేల నౌకలు ప్రయాణిస్తాయి. వీటిల్లో 9.4 బిలియన్ టన్నుల సరుకు రవాణా అవుతుంది. అంటే ప్రపంచవాణిజ్యంలో 40 శాతం వ్యాపారం మలక్కా నుండే జరుగుతోంది. ఇంతటి కీలకమైన మలక్కా మీద డ్రాగన్ కన్నుపడిందట. అండమాన్ లోనే మన త్రివిధ దళాలకు చెందిన జాయింట్ కమాండ్ కూడా ఉంది. ఇంతటి కీలకమైన ప్రాంతంమీద డ్రాగన్ కన్నుపడిందని సమాచారం.దక్షిణ చైనా సముద్రం హిందూ మహా సమద్రంలోకి చైనా కీలకమైన ప్రాంతాల్లోకి 33 నౌకలను పంపాలని నిర్ణయించిందట. ఇవన్నీ సర్వే నౌకలనని డ్రాగన్ చెబుతున్నా ఎవరు నమ్మటంలేదు. సర్వే నౌకల పేరుతో చైనా అన్నీ దేశాల పైన గూఢచర్యం చేస్తోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.ఇందులో భాగంగానే చైనా నౌకలు అండమాన్ నికోబార్ దీవుల దగ్గరకు రెగ్యులర్ గా వస్తున్నాయట. మనదేశం పరీక్షిస్తున్న మిస్సైల్స్ పాయింట్లన్నీ ఇక్కడే ఉన్నాయి. అందుకనే చైనా కూడా సర్వేల పేరుతో తన నిఘా నౌకలను ఇక్కడే మోహరించిందట. అంటే మనదేశాన్ని ముప్పుతిప్పలు పెట్టడానికే చైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అర్ధమవుతోంది. మరి మనదేశం ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.