విమానాశ్రయంపై డ్రోన్ దాడి భారీగా ఆస్తి నష్టం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ర‌ష్యాలోని ఈస్టోనియా బోర్డ‌ర్ వ‌ద్ద ఉన్న పిస్కోవ్ న‌గ‌ర విమానాశ్ర‌యంపై డ్రోన్ దాడిజ‌రిగింది. ఆ దాడిలో మిలిట‌రీకి చెందిన రెండు ర‌వాణా విమానాలు ధ్వంసం అయ్యాయి. వ‌రుస‌గా జ‌రిగిన డ్రోన్ అటాక్‌లో ఇలుషిన్ 76 ట్రాన్స్‌పోర్టు విమానాలు డ్యామేజ్ అయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. డ్రాన్ల దాడుల‌కు చెందిన వీడియోల‌ను రిలీజ్ చేశారు. పీస్కోవ్ న‌గ‌రం ఉక్రెయిన్‌కు సుమారు 600 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఈ దాడితో త‌మ‌కు సంబంధం లేద‌ని ఉక్రెయిన్ తెలిపింది. ఎయిర్‌పోర్టుపై జ‌రిగిన డ్రోన్ అటాక్‌ను తిప్పికొట్టిన‌ట్లు ర‌ష్యా తెలిపింది. ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని, కానీ ఆస్తి న‌ష్టం జ‌రిగిన‌ట్లు ర‌ష్యా అధికారులు చెప్పారు. దాదాపు 15 డ్రోన్ల‌తో ఎయిర్‌పోర్టుపై దాడి జ‌రిగి ఉంటుంద‌ని భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.