మునుగోడు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్/అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మునుగోడు అభ్యర్థిని ఖరారుచేసింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఉద్యమకారుడిగా పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే కోరుకుంటూ స్థానిక నాయకులు, కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టలను పరిశీలించిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మునుగోడు అభ్యర్థిని ఖరారుచేసింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఉద్యమకారుడిగా పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే కోరుకుంటూ స్థానిక నాయకులు, కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టలను పరిశీలించిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్పటికే ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 14 వరకు నామినేషన్లు సమర్పించవచ్చు. 15న నామినేషన్లను పరిశీలించనున్నారు. 17 వరకు నామపత్రాల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. నవంబర్‌ 3న పోలింగ్‌ జరుగనుంది. అదేనెల 6న ఫలితాలు వెలువడనున్నాయి.కాగా, పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల పేరును ప్రకటించడంతో నియోజకవర్గం వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున పటాకులు పేల్చారు. చండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పల్‌ మండలాల్లో సంబురాలు చేసుకున్నారు. పార్టీ అధినేత నిర్ణయం మేరకు భారీ మెజార్టీతో ప్రభాకర్‌ రెడ్డిని గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.