బీజేపీ నిరంకుశ విధానాలను మునుగోడు ప్రజలు తిప్పి కొట్టారు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీజేపీ నిరంకుశ విధానాలను మునుగోడు ప్రజలు తిప్పి కొట్టారని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడారు మునుగోడు ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గెలిచారు ,లౌకిక వాదులు గెలిచారు బీజేపీ నిరంకుశ విధానాలను మునుగోడు ప్రజలు తిప్పి కొట్టారని, మతోన్మాద , విచ్ఛిన్నకర శక్తులకు చంప పెట్టులా మునుగోడు తీర్పు వచ్చింది మునుగోడు ఎన్నికలు ప్రజల ఆకాంక్ష లను వెల్లడించాయి తెలంగాణ లో విచ్చిన్న కర శక్తులకు స్థానం లేదని మరోసారి రుజువైంది అన్నారు. దేశానికి మార్గదర్శనంలా రాజకీయాలు ఉండాలి.ఈ ఎన్నికల్లో కేంద్రం ఇన్ కం టాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా వాడారు. ఇది అత్యంత దుర్మార్గం ఇప్పటికే ED,CBI లు నవ్వుల పాలయ్యాయి.ఇక ఇన్ కంట్యాక్స్ డిపార్ట్మెంట్ ను కూడా కేంద్ర ప్రభుత్వం దిగజార్చింది దేశ రాజకీయాల్లో కేసీఆర్ గారి అవసరం చాలా ఉంది.సామాన్య ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా కేసీఆర్ గారు పాటుపడతారు కేసీఆర్ పై దేశ ప్రజలకు నమ్మకం పెరిగింది.అన్ని రంగాల్లో తెలంగాణ నేడు నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. ఇవ్వాళ తెలంగాణ మోడల్ దేశానికి అవసరం.ఈ ఎన్నికతో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. బలవంతంగా రుద్దిన మునుగోడు ఎన్నికలతో కోమటిరెడ్డి సోదరులు రాజకీయంగా నష్ట పోయారు పన్నులు వేస్తూ ప్రజలను దోచుకుంటున్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.