పల్నాడు ఘటనపై ఈసీ సీరియస్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగిన హింసాకాండ… దేశం దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ఈసీ…. ఏపీ డీజీపీ, సీఎస్ లకు ఆదేేశాలిచ్చింది. పలువురు ఎస్పీలు, డీఎస్పీలు, ఇతర సిబ్బందిపై వేటు కూడా పడింది. అయితే అన్నింటికన్నా మించి పల్నాడులో హింసాకాండకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. మరీ ముఖ్యంగా వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి… దౌర్జన్యం వెలుగుచూసింది. మాచర్ల నియోజకవర్గం పాలువాయి గేటులోని పోలింగ్ కేంద్రం(పోలింగ్ స్టేషన్ నెంబర్ 202)లోకి ప్రవేశించి ఈవీఎంను స్వయంగా పిన్నెల్లి ధ్వంసం చేసిన వీడియో రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

పిన్నెల్లిని అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ ను ఆయన, ఆయన అనుచరులు బెదిరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బూత్ లోకి వెళ్లి ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టిన దృశ్యాలు స్పష్టంగా ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గాన్ని సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించడంతో అక్కడ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. దీంతో, ఈ వీడియో అక్కడి సీసీటీవీ ఫుటేజిలో రికార్డయింది.

ఎప్పుడైతే హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటైందో అప్పటి నుంచి పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే పిన్నెల్లి కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో టీడీపీ సైబర్ ఆర్మీ పోస్టులు పెట్టడం, స్థానికంగా కూడా అనుమానాలురావడంతో తాను హైదరాబాద్ లో ఉన్నానంటూ పిన్నెల్లి బదులిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.