కర్ణాటక సార్వభౌమాధికారంవ్యాఖ్యలపైసోనియాను వివరణ కోరిన ఈసి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ  చేసిన కర్ణాటక సార్వభౌమాధికారంవ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కోరింది.అంతకు ముందు సోనియాగాంధీ తన ప్రసంగంలో సార్వభౌమాధికారం‘ అనే పదాన్ని ఉపయోగించడంపై అభ్యంతరం తెలిపిన బీజేపీ ఎంపీలు… ఎన్నికల కమిషన్‌ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాందీపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఈసీఐని బీజేపీ ప్రతినిధి బృందం కోరింది.కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కర్ణాటక ప్రతిష్టసార్వభౌమాధికారంసమగ్రతకు ముప్పుగా పరిణమించే ఎవరినీ కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదని కాంగ్రెస్ పార్టీ మే 6న ఒక ట్వీట్ చేసింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు.సోనియాగాంధీ సార్వభౌమాధికారం‘ అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగానే వాడినట్టు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ విమర్శించారు. ఆమెపై ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర మంత్రిబీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే సైతం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సార్వభౌమాధికారం పదాన్ని దేశానికి మాత్రమే ఉపయోగిస్తారనిసోనియాగాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.