లిక్కర్ స్కాం లో వేగం పెంచిన ఈడి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈడీ వేగం పెంచింది. ఇప్పటికే ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ.. తాజాగా ఈ కేసుకు సంబంధించిన సెకండ్ చార్జ్ షీట్ ను దాఖలు చేసింది. సెకండ్ చార్జ్ షీట్లో ఢిల్లీ సీఎం కేజీవాల్, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్తో పాటు మరో 17 మందిపై ఈడీ అభియోగాలు మోపింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చింది. తొలి చార్జ్ షీట్ లోనే ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చిన ఈడీ.. తాజాగా దాఖలు చేసిన రెండవ చార్జ్ షీట్లో సైతం కవిత పేరును చేర్చింది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు మాయం చేసిన వారి జాబితాలో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ చార్జ్ షీట్ లో చేర్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించడం, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ పేరును చేర్చడం వంటి అనూహ్య పరిణామాలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.