విపక్షాలను ఈడీ ఏకం చేస్తోంది

- ప్రధాని మోదీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దిల్లీ: ప్రజాస్వామ్య బలోపేతం కోసం చిత్తశుద్ధితో కృషి జరగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. భారత్‌.. ప్రజాస్వామ్య మాతృమూర్తి అని కొనియాడారు. 2030 దశాబ్దం.. భారత దశాబ్దంగా నిలుస్తుందన్నారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన ప్రసంగిస్తూ విపక్షనేతలపై విరుచుకుపడ్డారు. ‘‘విపక్ష నేతలు 9 ఏళ్లుగా ఆలోచించట్లేదు.. ఆరోపణలే చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఆర్‌బీఐ, ఈసీ, సైన్యంపై ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్నారు. నిర్మాణాత్మక విమర్శలను మేం స్వాగతిస్తాం. దేశం కోసం కాదు.. ఈడీ వల్లే విపక్ష నేతలు ఒక్కటవుతున్నారు. విపక్షాలను ఈడీ ఏకం చేస్తోంది’’ అని మోదీ విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.