క్యాసినో కేసులో తలసాని కుమారుడు సాయికి ఈడీ నోటీసులు జారీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వివాదంలో టీఆర్ఎస్ నేతలు నలిగిపోతున్నారు. వివిధ కేసుల్లో ప్రమేయమున్న వారిని కేంద్రంలోని బీజేపీ వేటాడుతోంది. ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్ సహా పలువురిపై ఈడీ దాడులు జరుగుతుండగా..   తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ తో సంబంధాలున్నాయంటూ మంత్రి తలసాని సోదరులను విచారించింది.తలసాని శ్రీనివాసయాదవ్ టీఆర్ఎస్ లో కీరోల్ పోషిస్తున్నారు. కేసీఆర్ కు నమ్మినబంటుగా ఉన్నారు.ఆయన సోదరులు మహేష్ యాదవ్ ధర్మేంద్రయాదవ్ లను ఈడీ అధికారులు విచారించింది. ఇప్పుడు ఏకంగా తలసాని కుమారుడికే ఎసరు పెట్టింది.  ఇది బీజేపీ ప్రతీకార దాడిగానే టీఆర్ఎస్ భావిస్తోంది.తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టిన బీజేపీ ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థలతో టీఆర్ఎస్ మంత్రులు నేతలను టార్గెట్ చేస్తోంది. ఈ మేరకు తాజాగా క్యాసినో కేసులో ఇప్పటికే టీఆర్ఎస్ మంత్రి తలసాని సోదరులకు నోటీసులు ఇచ్చిన ఈడీ తాజాగా తలసానికే బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా తలసాని కుమారుడు సాయికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది.క్యాసినో కేసులో టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే తలసాని బ్రదర్స్ తలసాని పీఏకు ఈడీ నోటీసులు ఇచ్చి విచారణ చేసింది. తాజాగా తలసాని కుమారుడు సాయికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. తలసాని బ్రదర్స్ పీఏ ఇచ్చిన సమాచారంతోనే సాయికి నోటీసులు ఇచ్చారని సమాచారం.చీకోటి ప్రవీణ్ తో కలిసి ఈ ఇద్దరు విదేశాలకు వెళ్లి క్యాసినో ఆడినట్లుగా ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు. చీకోటి ప్రవీణ్ జరిపిన లావాదేవీల్లో తలసాని సోదరులు మహేష్ ధర్మేందర్ యాదవ్ పేర్లు బయటకు రావడంతో అధికారులు పిలిచి విచారణ చేపట్టారు. హవాలా ఫేమా ఉల్లంఘన కింద ఇద్దరినీ విచారిస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈడీ అధికారులు చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసులో చాలా మందిని విచారణకు పిలిచారు. కానీ ఇప్పుడు తలసాని సోదరులను టార్గెట్ చేయడం సంచలనమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి పక్కదేశాలకు క్యాసినో వ్యవహారంలో తరలించిన కేసులో చీకోటి ప్రవీణ్ ను ఈడీ విచారించింది. అతడి నుంచి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అందులో టీఆర్ఎస్ నేతలకు సంబంధించిన లావాదేవీలు ఉన్నాయని.. అందుకే వారిని పిలిపించారని అంటున్నారు. చీకోటి ప్రవీణ్ హవాలా దందాను కూడా భారీ ఎత్తున చేపట్టినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.