ఎమ్మెల్యే నివాసంలో ఈడి సోదాలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు పలువురు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఇళ్లపై దాడులు చేసిన ఈడీ.. తాజాగా మరోసారి సోదాలు చేపట్టింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరుపుతోంది. ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంటితో పాటు మరో 8 చోట్ల ఏక కాలంలో సోదాలు కొనసాగుతున్నాయి.ఎమ్మెల్యేకు సంబంధించిన సంతోష్ గ్రానైట్ కంపెనీలోనూ సోదాలు జరుగుతున్నాయి. లగ్గారం గ్రామ సమీపంలో ఉన్న కార్యాలయంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే మధుసూదన్ రెడ్డితోపాటు మహిపాల్ రెడ్డిలపై కేసులు నమోదయ్యాయి. గతంలో సంగారెడ్డి కలెక్టర్ అక్రమ మైనింగ్‌లపై విచారణ జరిపిపించారు. ఆర్డీవో నేతృత్వంలో జరిగిన విచారణలో అక్రమ మైనింగ్‌లను గుర్తించారు. ఈ మేరకు లగ్గారంలో నమోదైన కేసు ఆధారంగా ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బినామీ పేర్లతో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. బినామీ పేర్లతోనే అక్రమ మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్లు తాజాగా అధికారులు గుర్తించారు. ఇవే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ బినామీ పేర్లతో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారుల సోదాల్లో బహిర్గతమైంది

Leave A Reply

Your email address will not be published.