డిఎస్సి నోటిఫికేషన్ జారీచేయాలని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీచేయాలని, DSC నోటిఫికేషన్ గత 7 సంవత్సరాల నుండి భర్తీ చేయడం లేదు కాబట్టి వెనువెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో విద్యా శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి జరపడం జరిగింది. ఈ ముట్టడి కార్యక్రమానికి తెలంగాణ నిరుద్యోగ జాక్ ఛైర్మన్ నీల వెంకటేష్ నాయకత్వం వహించారు. నిరుద్యోగులు ప్రభుత్వ శాఖలలో ఖాళీగా యున్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని నినాదాలు చేయడం జరిగింది. ఈ ముట్టడిని ఉద్దేశించి ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాటశాలల్లో 24 వేల DSC టీచర్ పోస్టులు భర్తీ చేయాలని  కోరారు. అలాగే ఎయిడెడ్ పాటశాలల్లో 4900 టీచర్ పోస్టులు, ఆదర్శ పాటశాలల్లో 2000, కస్తుర్భా పాటశాలల్లో 1500 టీచర్ పోస్టులుఖాళీగా ఉన్నవి. ఇవిగాక ప్రభుత్వ పాటశాలల్లో 4 వేల కంప్యుటర్ టీచర్ పోస్టులు, 10 వేల పి.ఇ.టి. పోస్టులు, 5 వేల ఆర్ట్స్, క్రాఫ్ట్స్ & డ్రాయింగ్ పోస్టులు, 3 వేల లైబ్రేరియన్ పోస్టులు, 4 వేల జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 10 వేల అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నవి. ఇంత పెద్దఎత్తున ఖాళీగా ఉంటె భర్తీ చేయకుండా ఇటు విద్యార్థుల భవిష్యత్ అటు నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద కులాల పిల్లలు SC/ST/BC – కుటుంబాల పిల్లలు చదువు కొనే ప్రభుత్వ పాఠశాలలో టీచర్లను నియమించకుండా వీరి అభివృద్ధికి అడ్డు తగులుతున్నారు.44 వేల టిచర్ పోస్టులు భర్తీ చేయకుండ ప్రభుత్వం విద్యావ్యవస్థ ను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ఒకవైపు ప్రభుత్వం పర్మి నెంట్ టిచర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో విద్యార్థులు విద్యా ప్రమాణాలు దెబ్బ తింటున్నాయి. పర్మనెంట్ టీచర్లను నియమించకుండా టెంపరరీ టీచర్లకు రకరకాల పేర్లతో నియమించి విద్య వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. పార్ట్ టైం టీచర్లు, గెస్ట్ టీచర్లు, ఆవర్లి బెసేడ్  టీచర్లు, విద్యా వాలంటరీలు, కాంట్రాక్టులు టీచర్లు అంటూ రకరకాల పేర్లతో సంవత్సరాల తరబడి తాత్కాలిక టీచర్లను నియమించి విద్యా వ్యవస్థను పాడు చేశారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దేశాన్ని అగ్రదేశంగా రూపొందించే విద్యా వ్యవస్థను పాలకుల నిర్లక్షంతో   భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే భావి భారత పౌరులకు చదువు చెప్పకపోతే వ్యవస్థ దేశం ఏలా అభివృద్ధి చెందుతుంధని అన్నారు. అనంతయ్య, రాజేందర్, నరసింహ గౌడ్, రామ కృష్ణ,  , మోడి రాందేవ్, భాస్కర్  తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.