చదువు వ్యాపారం కాదు

.. మండిపడ్డ ఎంపీ వరుణ్‌ గాంధీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చదువు వ్యాపారం కాదని బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఫీజు చెల్లించనందుకు పరీక్షలు రాసేందుకు అనుమతించకపోవడంతో విలపిస్తున్న ఓ బాలిక వీడియోను ఎంపీ ట్వీట్‌ చేశారు. ఫీజు కట్టలేక అవమానాలు ఎదుర్కొన్న లక్షలాది మంది చిన్నారుల బాధను ఈ బిడ్డ కన్నీళ్లు తెలియజేస్తున్నాయి’ అంటూ ట్వీట్‌ చేసిన ఆయన.. ఆర్థిక పరిమితులు పిల్లల చదువులకు ఆటంకం కలిగించకుండా చూసుకోవడం ప్రతి జిల్లా అధికారులుప్రజా ప్రతినిధుల నైతిక బాధ్యత’ అని గుర్తు చేశారు.ప్రైవేటు విద్యా సంస్థలు మానవత్వాన్ని మరువొద్దనిచదువు వ్యాపారం కాదన్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ బారిన వీడియో ఉన్నావ్‌ జిల్లాలోని బంగార్‌మావు సమీపంలోని తోలాకు చెందింది. అయితేట్యూషన్‌ ఫీజు చెల్లించనందుకు సోమవారం జరిగిన పరీక్షకు విద్యార్థులను హాజరుకాకుండా గేట్‌ వద్దే నిలిపివేశారు. పరీక్ష రాయలేకపోయినందుకు విద్యార్థులు రోధించారు. ఫీజు తీసుకువస్తామని చెప్పినా స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ వినకుండా తమను బయటకు వెళ్లగొట్టారని ఆరో తరగతి విద్యార్థిని అపూర్వసింగ్‌ తెలిపింది.అయితేజనం నుంచి ఒత్తిడి వచ్చిన తర్వాత పాఠశాల యాజమాన్యం దిగి వచ్చింది. పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని చెప్పింది. అయితేమిగతా విద్యార్థులు ఏం చదువుతున్నారుఎంత ఫీజు బకాయి ఉన్నదిఅనే వివరాలు తెలియరాలేదు. సెప్టెంబర్‌ నుంచి కనీసం పది మంది విద్యార్థులు ట్యూషన్‌ ఫీజు కట్టలేకపోయారు. ఈ క్రమంలో పరీక్షలు రాయకుండా గేట్‌ వద్దనే ఆపడంతో ఏడుస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ ఎంపీ తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేశారు.

Leave A Reply

Your email address will not be published.