సభ్యత్వ నమోదు ప్రారంభించిన విద్యాధికారి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఈరోజు బాన్సువాడ SC, ST ఉపాద్యాయ మండల శాఖ సబ్యత్వ నమోదు కార్యక్రమాన్ని  మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యల సంతోష్ మాట్లాడుతూ SC, ST ఉపాద్యాయుల సమస్యల కోసం పోరాడుతామని, ప్రభుత్వం స్పందించి ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ అధ్యక్షులు లకావత్ లఖ్య, రామవత్ గోపి, కోశాధికారి వసంత్, చంద్రశేఖర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.