పోలీస్ కస్టడీలో ఉన్న నలుగురు నిందితులను సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో ఎన్‌కౌంటర్

- తదుపరి విచారణను హైకోర్టు 23కు వాయిదా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దిశ ఎన్‌కౌంటర్‌ కు సంబంధించి కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ వాయిదా పడింది. ఎన్‌కౌంటర్‌కు గురైన బాధితుల తరపున సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ వృందా కార్వేల్ వాదనలు వినిపించారు. ఎన్‌కౌంటర్ జరిగిన తీరును వృందా కార్వేల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీస్ కస్టడీలో ఉన్న నలుగురు నిందితులను సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో ఎన్‌కౌంటర్ చేశారని న్యాయవాది తెలిపారు. సీసీ టీవీలో లారీని చూసి మొదట గుర్తు పట్టింది ఓనర్ శ్రీనివాస్ రెడ్డి అని పోలీసులు తెలిపారు. కానీ కమిషన్ ముందు శ్రీనివాస్ రెడ్డి ఈ విషయం వెల్లడించలేదు. కాగా ఈ కేసుకు సంబంధించి ఈనెల 23న ప్రభుత్వం వాదనలు వినిపించనుంది. దీంతో తదుపరి విచారణను హైకోర్టు 23కు వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.