మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరోసారి దాడులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తమిళనాడులో గురువారం మరోసారి దాడులు చేసింది. మంత్రి సెంథిల్ బాలాజీకి సంబంధించిన కేసులో దాడులు నిర్వహించినట్లు తెలుస్తున్నది. కోయంబత్తూరు, కరూర్‌లలో మంత్రి సెంథిల్‌ బినామీదారుల ప్రదేశాల్లో ఈ దాడులు నిర్వహించినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. మనీలాండరింగ్‌కు సంబంధించి మంత్రి సెంథిల్ బాలాజీ ఇంటితో పాటు కార్యాలయాల్లో జూన్‌ 14న ఈడీ దాడులు జరిపింది. ఆ తర్వాత ఆయనను అరెస్టు చేయగా.. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు.అయితే, అరెస్టు అయినా సెంథిల్‌ బాలాజీని ప్రభుత్వం మంత్రి పదవి నుంచి ఇంకా తొలగించలేదు. మరో వైపు బెయిల్ కోసం సెంథిల్ బాలాజీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ఈడీ స్పందన కోరింది. ఆయన విచారణ కోసం సహకరించడం లేదని, తన పదవిని దుర్వినియోగం చేసి రవాణాశాఖలో ఉద్యోగాల పేరిట కుంభకోణానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. ఇంతకుముందు సెంథిల్ బాలాజీకి బెయిల్ మంజూరు చేసేందుకు మద్రాసు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ బాలాజీ దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Leave A Reply

Your email address will not be published.